Begin typing your search above and press return to search.
ఆ పెద్దావిడను 72 ఫోన్ నెంబర్ల నుంచి విసిగించి.. వేధించాడు
By: Tupaki Desk | 6 Feb 2021 2:30 AM GMTఓ పెద్దావిడకు ఎదురైన చేదుఅనుభవం గురించి తెలిస్తే షాక్ తినాల్సిందే. అంత వయసులో ఎంత పెద్ద కష్టం వచ్చిందన్న ఆందోళనకు గురి కావటం ఖాయం. ఎవరు చేస్తున్నారో.. ఎందుకు చేస్తున్నారో తెలీదు.. ఒక నెంబరుకు తర్వాతి నెంబరుకు సంబంధం లేకుండా అదే పనిగా ఫోన్ చేయటం.. ఆ వెంటనే బండ బూతులు తిట్టేయటం.. దారుణంగా మాట్లాడటం చేసేవారు. ఇలాంటి విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్న పెద్దావిడకు ఏకంగా అరవైఏళ్లకు పైనే. గడిచిన మూడేళ్లుగా ఆమె ఈ టార్చర్ ను అనుభవిస్తున్నారు.
పూర్తిగా విసిగిపోయిన ఆమె.. తప్పనిసరి పరిస్థితుల్లో.. తనను అదే పనిగా తిట్టి వేధించే యువకుడి సంగతి తేల్చాలని ఫిక్స్ అయిన ఆమె.. హైదరాబాద్ షీ టీంకు కంప్లైంట్ చేశారు.దీంతో రంగంలోకి దిగారు పోలీసులు. మొబైల్ నెంబరును బ్లాక్ చేస్తే.. మరో నెంబరుతో చేసి తిట్టేవాడు. నెంబర్లను సేకరించిన పోలీసులు.. విశ్లేషించి చూసిన ఆశ్చర్యానికి గురయ్యాడు.
ఫోన్ లో వేధించే ఆ యువకుడు ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన వాడిగా గుర్తించారు. అంతేకాదు.. ఆమెకు వచ్చిన ఫోన్ నెంబర్లు మొత్తం ఒకే గ్రామం నుంచి వస్తున్న విషయాన్ని గమనించిన వారు.. గ్రామానికి చెందిన వెంటకనాయుడు అనే వ్యక్తి అత్యవసరంగా మాట్లాడాలని గ్రామస్థుల మొబైల్స్ ను తీసుకునేవాడు. తర్వాత.. తిరిగి ఇచ్చేసేవాడు. కానీ.. అతడు చేస్తున్న పని గురించి గ్రామస్థులకు పోలీసులు చెప్పగా వారు ఆశ్చర్యానికి గురయ్యారు.
గ్రామస్తుల సమక్షంలో వేధింపులకు గురి చేసిన వెంకటనాయుడికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇక నుంచి ఎలాంటి తప్పు జరగకుండా చూస్తామని స్థానిక సర్పంచ్ హామీ ఇవ్వటంతో పోలీసులు వెనుదిరిగారు. స్థానికంగా ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ ఉదంతం గురించి తెలుసుకున్న తర్వాత అర్థమయ్యేది ఒక్కటే. ఎవరైనా.. ఫోన్ అడిగినంతనే ఎందుకు అడిగాడన్న విషయాన్ని కాస్త చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందేమో కదూ?