Begin typing your search above and press return to search.

మీరీ ప‌నులు చేస్తే.. ఐటీ రిట‌ర్న్ త‌ప్ప‌నిస‌రి!

By:  Tupaki Desk   |   8 July 2019 5:02 AM GMT
మీరీ ప‌నులు చేస్తే.. ఐటీ రిట‌ర్న్ త‌ప్ప‌నిస‌రి!
X
కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిర్మ‌లా సీతారామ‌న్ బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్ట‌టం తెలిసిందే. మెరుపుల కంటే.. బాదుడు మీద‌నే ఎక్కువ ఫోక‌స్ చేసిన ఆమె బ‌డ్జెట్ మీద సామాన్య‌.. మ‌ధ్య త‌ర‌గ‌తి జీవులు పెద‌వి విరిచేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. బ‌డ్జెట్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏమీ చేయ‌టం లేద‌న్న విష‌యాన్ని చెప్పేయ‌టంతో.. మోడీ మాష్టారి మీద తెలుగోళ్ల‌కు మ‌రింత కోపం పెరిగిన ప‌రిస్థితి.

ఈ రాజ‌కీయ విష‌యాల్ని ప‌క్క‌న పెట్టేస్తే.. బ‌డ్జెట్ వేళ‌.. కొన్ని కొత్త విధానాల్ని కేంద్రం ప్ర‌తిపాదించింది. బ‌డ్జెట్ ఖాయంగా ఆమోదం కానున్న నేప‌థ్యంలో తాజా బ‌డ్జెట్ లో ప్ర‌స్తావించిన కొత్త అంశాలు ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఏడాది వ్య‌వ‌ధిలో ఎక్కువ‌గా ఖ‌ర్చుచేసే వారు ఐటీ రిట‌ర్ను దాఖ‌లు చేయ‌టం తప్ప‌నిస‌రి చేస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది.

ఇందుకోసం కొన్ని అంశాల్ని తెర మీద‌కు తెచ్చింది. ప‌న్ను విధించే ఆదాయం రూ.5ల‌క్ష‌ల లోపు ఉంటే ప్ర‌భుత్వానికి ఎలాంటి రిట‌ర్న్ లు దాఖ‌లు చేయాల్సిన అవ‌స‌రం లేదు కానీ.. అధికంగా ఖ‌ర్చు చేసే వారు మాత్రం త‌ప్ప‌నిస‌రిగా రిట‌ర్న్ లు దాఖ‌లు చేయ‌టం త‌ప్ప‌నిస‌రిగా మారింది.

ఒక‌వేళ మీ వార్షిక ఆదాయం రూ.5ల‌క్ష‌ల లోపే. కానీ.. మీరు ఏడాది వ్య‌వ‌ధిలో చేసిన ఖ‌ర్చు మాత్రం రూ.5ల‌క్ష‌లు దాటింద‌ని అనుకుందాం.. త‌ప్ప‌నిస‌రిగా మీరు రిట‌ర్న్ దాఖ‌లు చేయాల్సిందే. దీంతో.. సామాన్యులు సైతం ఐటీ రిట‌ర్న్ దాఖ‌లు చేయ‌క త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు ఒక బ‌డుగు జీవి ఇల్లు కొన్నాడ‌నుకుందాం. తాను దాచుకున్న పొదుపు సొమ్ముతో కిందామీదా ప‌డి ఇల్లుకొన్నాడ‌నే అనుకుంటే.. అత‌ను త‌ప్ప‌నిస‌రిగా ఐటీ రిట‌ర్న్ దాఖ‌లు చేయాలి. అంత‌దాకా ఎందుకు? ఇంట్లో ఏదైనా శుభ‌కార్యం జ‌రిగింద‌నే అనుకుందాం. ఖ‌ర్చు ఎక్కువ‌గా ఉండి బ్యాంకుల నుంచి డ‌బ్బులు తీసి వాడినా.. క్రెడిట్ కార్డు ఖ‌ర్చు చేసినా.. వేరే స్నేహితుడి నుంచి బ్యాంకు అకౌంట్లో డ‌బ్బులు అప్ప‌గా తీసుకొని.. ఆ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో వేశార‌నే అనుకుందాం. ఆ మొత్తం రూ.5ల‌క్ష‌ల‌కు మించి ఉంటే త‌ప్ప‌నిస‌రిగా ఐటీ రిట‌ర్న్ దాఖ‌లు చేయ‌క త‌ప్ప‌దు.

అంతేనా..ఫారిన్ టూర్ కోసం రూ.2ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తే రిట‌ర్న్ త‌ప్ప‌నిస‌రి. ఏడాది వ్య‌వ‌ధిలో బ్యాంకులో కోటి రూపాయిల్ని జ‌మ చేసినా.. రిట‌ర్న్ దాఖ‌లు చేయాల్సిందే. స‌హ‌కార బ్యాంకుల‌తో స‌హా ఏ బ్యాంకులో వేసినా ఐటీ రిట‌ర్న్ ఖాయంగా వేయాల్సిందే. అంతేకాదు.. దీర్ఘ‌కాలంగా పొదుపు చేసే మొత్తాల‌కు.. ఆదాయాన్ని ఇళ్లు.. బాండ్లు.. క్యాపిట‌ల్ గెయిన్స్ ఇలా.. ఆదాయం ఏదైనా.. ఏ రూపంలో వ‌చ్చినా ఆ మొత్తం రూ.5ల‌క్ష‌లు దాటినా రిట‌ర్న్ త‌ప్ప‌నిస‌రి. అదే స‌య‌మంలో ఖ‌ర్చు విష‌యంలోనూ ఇదే నిబంధ‌న ఖాయంగా అమ‌లు కానుంది. ఈ నేప‌థ్యంలో ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేసే వారి సంఖ్య భారీగా పెర‌గ‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. సో.. ఖ‌ర్చు చేసే ప్ర‌తిరూపాయి లెక్క‌లోకి వెళుంద‌న్న విష‌యం గుర్తు పెట్టుకోవాల్సిందే.