Begin typing your search above and press return to search.
షీ టీంకు ఐదేళ్లలో 22 కంప్లైంట్లు చేసింది
By: Tupaki Desk | 30 Oct 2019 5:05 AM GMTఈవ్ టీజింగ్.. వేధింపులకు చెక్ పెట్టేందుకు ఏర్పాటు చేసిన షీ టీమ్స్ కారణంగా ఈ తరహా నేరాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. కంప్లైంట్ చేసినంతనే స్పందించే షీటీమ్ తో మహిళల భద్రతకు భరోసా లభిస్తోంది. అలాంటి షీటీమ్ కు హైదరాబాద్ కు చెందిన ఒక మహిళ తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. ఆమె చేసిన కంప్లైంట్ల మీద ప్రత్యేక శ్రద్ద చూపించాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.
హైదరాబాద్ కు చెందిన ఒక యువతి గడిచిన ఐదేళ్లలో ఇప్పటి వరకూ 22 మంది మీద షీ టీమ్ కు కంప్లైంట్ చేసిందన్న విషయాన్ని గుర్తించింది. వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు వ్యక్తుల మీద ఆమె ఫిర్యాదులు ఇస్తూనే ఉన్నారు. ఇటీవల పెండింగ్ కేసుల వివరాల్ని తనిఖీ చేస్తున్న సందర్భంగా ఒకే మహిళ పెద్ద ఎత్తున కంప్లైంట్లు ఇస్తున్న వైనాన్ని గుర్తించారు.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఏదో విషయం మీద తిట్టిన తండ్రి మీద కూడా షీటీమ్ కు కంప్లైంట్ ఇవ్వటాన్ని ఈ సందర్భంగా గుర్తించారు. సదరు మహిళ ఎవరు? ఏం చేస్తుంటారు? తరచూ ఇంత మందిపై ఫిర్యాదులు చేయటం వెనుక కారణం ఏమిటి? లాంటి అంశాలపై పోలీసులు ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఆమె ఇచ్చిన 22 కంప్లైంట్లను పరిశీలించి.. ఆమెను పిలిపించి.. మాట్లాడాలని షీటీమ్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.