Begin typing your search above and press return to search.
భారత భూభాగంలో మరో ఆర్మీక్యాంపు..! చైనా బరితెగింపు..!
By: Tupaki Desk | 26 March 2021 8:30 AM GMTగత ఏడాది లడఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరస్థితులు నెలకొన్నది మొదలు.. చైనా భారత్ తో కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. అప్పట్లో చైనా సైనికులతో జరిగిన దాడిలో మన సైనికులు దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పటికీ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టిస్తూనే ఉంది. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమేనని ఆ దేశం చెప్పుకుంటూ ఉంటుంది. అంతేకాక ఆ రాష్ట్రంలో ఓ గ్రామాన్ని కూడా నిర్మించింది. మరోవైపు లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద కూడా తరుచూ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ఏదో ఓ క్యాంపు ఏర్పాటు చేస్తూ రెచ్చగొడుతూ ఉంటుంది.
తాజాగా సిక్కిం సమీపంలోని నకు లా పాస్ వద్ద వివాదాస్పద ప్రదేశాల్లో కొత్తగా ఆర్మీ పోస్టులను ఏర్పాటు చేసింది. ఈ మేరకు జాతీయ మీడియా చానల్ ఇండియా టుడే ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. చైనా నిర్మించిన గ్రామానికి సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను విడుదల చేసింది. భారత్-చైనా సరిహద్దులను పంచుకుంటోన్న సిక్కిం సమీపంలోని డోక్లామ్, నకు లా పాస్ తరచూ వివాదాలకు కేంద్రబిందువు అవుతూ వస్తున్నది. భారత్-చైనా-భూటాన్ సరిహద్దుల్లో ట్రై జంక్షన్ గా గుర్తింపు ఉన్న డోక్లామ్ ప్రాంతం వద్ద గ్రౌండ్ జీరో వద్ద 2017లో భారత్-చైనా జవాన్ల మధ్య ఘర్షణపూరక వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.
క్యాపెల్లా స్పేస్ కంపెనీకి చెందిన సింథటిక్-అపెచ్యుర్ రాడార్, ప్లానెట్ ల్యాబ్స్ చిత్రీకరించిన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో ఈ ఆర్మీ పోస్టులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మార్చి 12వ తేదీన రాడార్ ఈ ఫొటోలను తీసింది. చైనా మిలటరీ కార్యకలాపాలు ఉధృతంగా కొనసాగుతున్న విషయాన్ని బట్టబయలు చేసింది. కొత్త శిబిరాలు, పోస్టులు, రోడ్ల నిర్మాణాలు ముమ్మరంగా సాగుతున్నట్లు ఇండియా టుడే తన ప్రత్యేక కథనంలో పేర్కొంది.
అయితే చైనా ఆర్మీ తీసుకుంటున్న ఈ దుందుడుకు చర్యలపట్ల మనదేశం ఇంకా స్పందించలేదు. ఈ వివాదాలు, చాయా చిత్రాలపై భారత ఆర్మీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇప్పటికే భారత్, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. చైనాకు చెందిన పలు యాప్ లను మనదేశం బ్యాన్ చేసింది. దీంతో ఆ దేశం తీవ్రంగా నష్టపోయింది. తాజాగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి.