Begin typing your search above and press return to search.
తాజాగా శ్రీలంకలో మరో బాంబు పేలుడు!
By: Tupaki Desk | 25 April 2019 6:58 AM GMTశ్రీలంక చరిత్రలో మునుపెన్నడూ చోటు చేసుకోని రీతిలో జరిగిన ఉగ్రదాడులు ఆ దేశానికి కంటినిండా కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎల్టీటీఈ ఎపిసోడ్ ముగిసిన తర్వాత ప్రశాంతంగా ఉన్న ఆ దేశంలో.. ఇంత భారీ స్థాయిలో ఉగ్రదాడి జరగటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. ఈస్టర్ పర్వదినాన చర్చితో సహా పలు ప్రాంతాల్లో మానవ బాంబు పేలుళ్లు చోటు చేసుకోవటం.. వందలాది మంది మరణించటం తెలిసిందే.
ఆదివారం చోటు చేసుకున్న బాంబుపేలుళ్ల తర్వాత బుధవారం మరో పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం చోటు చేసుకోలేదు. ఇదిలా ఉండగా.. ఈ రోజు ఉదయం శ్రీలంక రాజధాని కొంటోకు 40 కిలోమీటర్ల దూరంలో పుగోడా పట్టణంలో బాంబు పేలుడు చోటు చేసుకుంది. దీంతో.. అక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
తాజాగా చోటు చేసుకున్న బాంబు పేలుడులో ఎవరైనా గాయపడ్డారా? నష్టం ఎంతన్న విషయంపై స్పష్టత రావట్లేదు. బాంబు పేలుళ్ల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పోలీసులు నిర్విరామంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇలాంటివేళ.. పలు ప్రాంతాల్లో బాంబుపేలుళ్లు చోటు చేసుకోవటంతో అక్కడి ప్రజలు ఏ నిమిషాన ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆదివారం చోటు చేసుకున్న బాంబుపేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య 321కి చేరుకోగా వందల సంఖ్యలో క్షతగాత్రులున్నారు.