Begin typing your search above and press return to search.

కేసీఆర్ కవితకు మరో శరాఘాతం.. ఈసారి ఇలా ఇరుక్కుపోయిందా?

By:  Tupaki Desk   |   7 Sep 2022 11:29 AM GMT
కేసీఆర్ కవితకు మరో శరాఘాతం.. ఈసారి ఇలా ఇరుక్కుపోయిందా?
X
తెలంగాణ బీజేపీ అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు కవితను టార్గెట్ చేసింది. ఇప్పటికే పలు ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీలకు ఇప్పుడు మరో ప్రధాన అస్త్రం దొరికింది. ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణల నిందితుడితో ఎమ్మెల్సీ కవిత దిగిన ఫొటో తాజాగా వైరల్ అవుతోంది. సీబీఐ కేసులో ఏ14 రామచంద్ర పిళ్లై కుటుంబంతో తిరుమలలో కవిత కనిపించారని బీజేపీ ఆరోపిస్తోంది.

బోయినపల్లి అభిషేక్ రావుతో సహా కవిత తిరుమల టూర్ కు వెళ్లారు. అయితే లిక్కర్ స్కాం నిందితుడితో ఎమ్మెల్యే కవిత తిరుమలకు ఎందుకు వెళ్లారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. రామచంద్ర పిళ్లైని కలవలేని గతంలో కవిత చెప్పారని గుర్తు చేశారు. లిక్కర్ స్కామ్ తో సంబంధం లేదన్న కవిత.. రామచంద్ర పిళ్లైతో కలిసి తిరుమలకు ఎందుకెళ్లారని నిలదీశారు.

కవిత నోటీసులకు భయపడే వాళ్లం కాదని.. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా గొంతు నొక్కేస్తున్నారని.. ఏదో కారణంతో సభ నుంచి బయటకు పంపించాలని చూస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. బీజేపీ సమావేశానికి తమను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. సీబీఐ సమాచారంతో ముడుపులపై ఈడీ కూపీ లాగుతోంది. ఢిల్లీ మద్యం టెండర్స్ లో కంపెనీల సిండికేట్ కు హైదరాబాద్ లో ప్లాన్ జరిగినట్లు సీబీఐ అనుమానిస్తోంది. దీంతో హైదరాబాద్ లో ఐదుచోట్ల ఢిల్లీ ఈడీ బృందం తనిఖీలు చేపట్టింది. రాబిన్ డిస్టలరీస్, డైరెక్టర్ కార్యాలయాల్లో సోదాలు జరుపుతోంది. సికింద్రాబాద్, కోకాపేట్, నార్సింగ్ లో సీబీఐ సోదాలు జరిపింది. కీలక ఆధారాలు స్వాధీనం చేసుకుంది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాంచంద్రన్ పిళ్లై ఇతర వ్యాపారాలపై సీబీఐ దృష్టి సారించింది. హైదరాబాద్, కర్ణాటక, చెన్నై, ఢిల్లీలోని వ్యాపారాలపై ఫోకస్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.