Begin typing your search above and press return to search.

మోదీకి మరో అత్యాధునిక విమానం .. ధర ఎంతంటే..!

By:  Tupaki Desk   |   24 Oct 2020 1:30 PM GMT
మోదీకి మరో అత్యాధునిక విమానం .. ధర ఎంతంటే..!
X
దేశంలో ప్రధానమంత్రికి భద్రత అనేది అత్యంత సవాలుతో కూడుకున్న అంశం. ఎంత హై సెక్యూరిటీ ఉన్నప్పటికీ శత్రువులతో బెడద తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీ కోసం ప్రత్యేక బోయింగ్ 777-300ER VVIP మరో విమానం సిద్ధమైంది. ఇప్పటికే ఓ విమానం
ఈ నెల మొదట్లో ఢిల్లీ కి చేరిన సంగతి తెలిసిందే. తాజాగా మరో విమానం ఈ రోజు రాజధాని ఢిల్లీకి చేరుకోనుంది. బోయింగ్ 777-300 ఈఆర్‌ అనే రెండు విమానాలు 2018లో ఎయిర్ ఇండియాలో చేరాయి. ఈ రెండు విమానాలు క్షిపణి రక్షణ వ్యవస్థలను కలిగి ఉన్నాయి. ఇవి 2024లో అమెరికా అధ్యక్షుడికి ఏర్పాటు చేయబోయే విమానాలులాగా ఉంటాయి. అమెరికా అధ్యక్షుడికి బోయింగ్‌ 747-200 బీ సిరీస్‌ విమానాలు సిద్ధం చేస్తున్నారు. ఇవి కూడా వాటితో సమానమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

ఇప్పటి వరకు రాష్టపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని ఎవరు విదేశాలకు ప్రయాణించాలన్నా ప్రతిసారి ప్రభుత్వం ఎయిర్‌ ఇండియాను అభ్యర్థించి విమానాలను సిద్ధం చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ సమస్య లేకుండా వారి కోసమే ప్రత్యేకవిమానం వచ్చేసింది. ఇవి ఈ ఏడాది ఆగస్టులోనే ఇండియాకు రావాల్సి ఉండగా కొన్ని సమస్యల కారణంగా ఆలస్యం అయ్యింది. B777 విమానాలలో లార్జ్ ఎయిర్ ‌క్రాఫ్ట్ ఇన్‌ఫ్రార్డ్ కౌంటర్ ‌మెజర్స్ (ఎల్ ఏ ఐఆర్సీఎం) సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్ (ఎస్పీఎస్) గా పిలిచే అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థలు ఇందులో ఉంటాయి. ప్రస్తుతం రాష్ట్రపతి, ఉప-రాష్ట్రపతి, ప్రధాని తమ పర్యటనలకు బోయింగ్-747 విమానాలు వినియోగిస్తున్నారు. ఈ విమానాల నిర్వహణ బాధ్యతలను ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ చూస్తోంది.

ఇందులోని ఈడబ్ల్యూ జామర్.. శత్రువు రాడార్ సిగ్నల్స్ ను, ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ను బ్లాక్ చేస్తుంది. ఇది పూర్తి మిర్రర్ బాల్ వ్యవస్థను కలిగి ఉంటుంది. అంతేకాదు, అత్యంత ఆధునిక సురక్షితమైన ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా బీ777లో పొందుపర్చారు. దీని ద్వారా ప్రధాని ప్రపంచంలో ఏ మూలనున్న వ్యక్తులతోనైనా మాట్లాడవచ్చు. భారత్ కొనుగోలు చేసిన రెండు విమానాల్లో ఒకటి ప్రధానికి, రెండోది రాష్ట్రపతికి వాడనున్నారు. ఈ విమానం ఒక్కోదాని ధర రూ. 8458 కోట్లని అంచనా.