Begin typing your search above and press return to search.
కంగనాపై దేశద్రోహం పెట్టరా..?
By: Tupaki Desk | 13 March 2021 11:30 AM GMTకేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే.. దేశద్రోహం కేసులు పెడుతున్నారనే విమర్శలు ఇప్పటి వరకూ చాలా వచ్చిన విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణపై అభ్యంతరాలు తెలిపిన పలువురిపై దేశ ద్రోహం కేసులు పెట్టారు. సీఏఏ కు వ్యతిరేకంగా నాటకం వేసినందుకు కర్నాకట రాష్ట్రం బీదర్ లోని ఓ స్కూల్లోని నాలుగు, ఐదో తరగతి విద్యార్థులపైనా దేశ ద్రోహం కేసు నమోదు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ విధంగా.. ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారిపై దేశ ద్రోహం చట్టాన్ని ప్రయోగిస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి.
అయితే.. తమ పార్టీకి చెందిన వారు, తమకు అనుకూలమైనవారు దేశంపైనా, జాతీయ నాయకులపైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా మౌనంగా ఉంటోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జాతిపిత మహాత్మాగాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గాంధీజీ తన సొంత బిడ్డలను వేధించారని వ్యాఖ్యానించింది కంగనా.
అంతేకాదు.. అతిథుల టాయిలెట్లు శుభ్రం చేయలేదని తన భార్యను ఇంటి నుంచి బయటకు గెంటేసినట్లు పలు కథనాలు ఉన్నాయని చెప్పుకొచ్చిన కంగనా.. ఇంత చేసినప్పటికీ.. గాంధీ జాతిపిత అయ్యారని తీవ్రంగా విమర్శించింది.
అంతేకాకుండా.. ఇంకా దారుణమైన వ్యాఖ్యలు చేసింది కంగనా. గాంధీ మంచి భర్త కాదని, మంచి తండ్ఇర కాదని తీవ్రంగా వ్యాఖ్యానించింది. అయినప్పటికీ.. ఆయన దేశంలో ఒక గొప్ప నాయకుడు అయ్యారని, ఇది కేవలం పురుష ఆధిక్యత వల్లే సాధ్యమైందని ట్విట్టర్లో సంచలన పోస్టు చేసింది.
కంగనా తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే వివాదాలు రాజేయాలని కంగనా ఇలా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు నెటిజన్లు. ఇటీవల రైతులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కంగనా.. వారంతా ఉగ్రవాదులే అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ విధంగా వ్యవహరిస్తున్నవారిపై దేశ ద్రోహం కేసు పెట్టరా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.