Begin typing your search above and press return to search.
చంద్రబాబు ఆప్తుడు బొల్లినేని మరో సీబీఐ కేసు
By: Tupaki Desk | 13 Sep 2020 11:30 AM GMTహైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ లో పన్ను ఎగవేత నిరోధక విభాగంలో అవినీతి బయటపడింది. ఇన్ ఫుట్ క్రెడిట్ మంజూరుకు అధికారులు ఓ కంపెనీ డైరెక్టర్ల నుంచి ఏకంగా రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇందులో ఉద్యోగులు సుధారాణి, బొల్లినేని శ్రీనివాస గాంధీ, ఓ ప్రైవేటు కంపెనీ డైరెక్టర్ సత్య శ్రీధర్ రెడ్డిలపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.
ఓ ప్రైవేటు కంపెనీకి సంబంధించిన దాడుల్లో ఈ లంచం వ్యవహారం గుట్టు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సీబీఐ అధికారులు జీఎస్టీ కమిషనరేట్ లోని అవినీతి తిమింగలాలను పట్టుకున్నారు.ఆదాయానికి మించి ఆస్తుల కేసు తవ్వుతున్న క్రమంలోనే బొల్లినేనిపై తాజాగా కేసు నమోదైందని సమాచారం.
జీఎస్టీ ఆన్ ఫుట్ క్రెడిట్ ట్యాక్స్ (ఐటీసీ) పొందాయన్న కేసును చిలుక సుధారాణి , బొల్లినేని శ్రీనివాసగాంధీ బృందం దర్యాప్తుచేసింది. కేసును నిందితులకు అనుకూలంగా మార్చేందుకు వీరు, మరికొందరు జీఎస్టీ అధికారులతో కలిసి రూ.5 కోట్లు లంచం డిమాండ్ చేశారని సీబీఐకి ఉప్పందంది. ఈ సందర్భంగా రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు.
కాగా మాజీ సీఎం చంద్రబాబుకు అత్యంత ఆప్తుడిగా బొల్లినేని శ్రీనివాసగాంధీకి పేరుంది. గత ఏడాది ఆదాయానికి మించి ఆస్తుల కేసు ఆయనపై నమోదైంది. గతంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లో పనిచేసినప్పుడు తన పోస్టును అడ్డం పెట్టుకొని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలు, సూచనలతోనే ఎదుటివారిపై విరుచుకుపడినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరొందిన బొల్లినేని 2004 నుంచి 2017 వరకు బొల్లినేని శ్రీనివాస్ గాంధీ ఈడీలోనే విధులు నిర్వర్తించారు. అప్పట్లో ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి.