Begin typing your search above and press return to search.

టీఆర్పీ కుంభకోణంలో మరో అరెస్టు.. ఈసారి ఎవరంటే?

By:  Tupaki Desk   |   13 Dec 2020 11:08 AM GMT
టీఆర్పీ కుంభకోణంలో మరో అరెస్టు.. ఈసారి ఎవరంటే?
X
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన టీఆర్పీ (టెలివిజన్ రేటింగ్ పాయింట్స్) కుంభకోణం కారణంగా చోటు చేసుకున్న రచ్చ తెలిసిందే. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న చానళ్లు అన్ని తాము సుద్దపూసలమని.. తమకే పాపం తెలీదని చెప్పటం తెలిసిందే. తాజాగా ఈ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నరిపబ్లిక్ టీవీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛానల్ కు చెందిన సీఈవో వికాస్ ఖాన్ చందానీని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు.

ఇటీవల కాలంలో ముంబయి పోలీసులు వర్సెస్ రిపబ్లిక్ టీవీ అన్నట్లుతా చోటు చేసుకున్న పరిణామాలకు.. తాజా ఉదంతం ఒక కొనసాగింపుగా చెబుతన్నా.. అలాంటిదేమీ లేదని పోలీసు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.ఇప్పటికి ఈ స్కాంలో పదమూడు మంది అరెస్టు అయ్యారు. రిపబ్లిక్ టీవీ పశ్చిమ విభాగం డిస్ట్రిబ్యూటర్ హెడ్ ఘన్ శ్యామ్ సింగ్ ను పోలీసులు నవంబరులో అరెస్టు చేశారు. ఆయనకు ఈ మధ్యనే బెయిల్ వచ్చింది.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య నేపథ్యంలో ముంబయి పోలీసులపై చానళ్లు విపరీతంగా విరుచుకుపడటం.. రిపబ్లిక్ చానల్ జోరుకు కళ్లాలు వేసేందుకే ఈ కుంభకోణాన్ని తెర మీదకు తెచ్చినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అయితే.. అలాంటిదేమీ లేదని.. కచ్ఛితమైన ఆధారాలతోనే కేసును విచారిస్తున్నట్లుగా ముంబయి పోలీసులు స్పష్టం చేస్తున్నారు. రిపబ్లిక్ టీవీ చానల్ తో పాటు.. రెండు మరాఠా చానళ్లు సైతం నకిలీ టీఆర్పీ రేటింగ్ తో మోసాలకు పాల్పడుతున్నట్లుగా ముంబయి నగర పోలీస్ కమిషన్ వీర్ సింగ్ గతంలో చెప్పటం తెలిసిందే. ఏమైనా.. రిపబ్లిక్ చానల్ కు ముంబయి పోలీసుల నుంచి కష్టాలు తీరే సూచనలు ఇప్పట్లో లేవన్నమాట బలంగా వినిపిస్తోంది. అదెంత నిజమో..కాలమే చెప్పాలి.