Begin typing your search above and press return to search.
కరోనా భయమే మనిషి ప్రాణాలు తీస్తుంది .. మరో దంపతుల ఆత్మహత్య !
By: Tupaki Desk | 21 May 2021 8:30 AM GMTమనదేశంలో కరోనా వైరస్ ఉధృతి రోజురోజుకి మరింత దారుణంగా తయారౌతోంది. ప్రతిరోజూ కూడా ఎక్కువ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ లో తన ప్రతాపాన్ని చూపిస్తుంది.ప్రతి రోజు కూడా వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. కనీసం , కరోనా మృతదేహాలు కాల్చడానికి శ్మశానాల్లో స్థలం లేకుండాపోతుంది అంటేనే పరిస్థితి ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు. మరోవైపు వాక్సిన్ బాధలు.. కొంతమంది వైద్య సిబ్బంది, నకిలీ డాక్టర్లు వ్యాక్సిన్ ను బ్లాక్ మార్కెట్ లో అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఆస్పత్రుల్లో బెడ్స్ లేవు. కరోనా తీవ్రంగా ఉన్న పేషెంట్లకు ఆక్సిజన్ లేదు. అంతా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ సమయంలో మన చాలా దృడంగా ఉంటూ , కుటుంబానికి సహాయంగా ఉండాలి. కానీ, కరోనా భయంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. కృష్ణా జిల్లా పెడన గ్రామంలో కరోనా భయంతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగు చూసింది. పెడన గ్రామానికి చెందిన లీలాప్రసాద్ , భారతి అనే దంపతులు వారం రోజులుగా స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు.ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. కరోనా వారిలో మానసిక ఆందోళన అంతకంతకూ పెంచింది. తెలియని భయాన్ని నింపింది. దీంతో ఈ బతుకు కంటే చావడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి దంపతులిద్దరూ ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కరోనా విలయం కొనసాగుతున్న వేళ అనవసర భయాలు ఇప్పుడు బలవన్మరణాలకు కారణమవుతున్నాయి. కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణైతే చాలు ఇక ఏమైపోతామోనన్న ఆందోళన, బతుకు మీద నైరాశ్యం, వైద్య ఖర్చులపై బెంగ,ఆసుపత్రిలో పడక, ఆక్సిజన్ లభిస్తుందో లేదోనన్న భయాలు మనిషిని నీడలా వెంటాడుతున్నాయి.వీటికి తోడు చికిత్స సమయంలో ఒంటరితనం, మానసిక కుంగుబాటు ఇలా అనేక అంశాలు కరోనా బాధితుల ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. కరోనా వచ్చిన వారిని దోషులుగా, వెలివేసినట్లుగా చూసే సంఘ దృష్టి మారాలి. కరోనా బారిన పడిన వారికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతోపాటు, ఇరుగు పొరుగువారు కూడా అండగా నిలవాలి. నిరంతరం వారితో మాట్లాడుతూ సానుకూల దృక్పధం పెంచే మాటలు చెప్పాలి. కరోనా బారిన పడిన వారికి ఆరోగ్య, ఆహార, ఆర్ధిక విషయాలలో భరోసా నివ్వాలి.