Begin typing your search above and press return to search.
బీజేపీలో మరో అసమ్మతి.. 23మంది ఎమ్మెల్యేలు
By: Tupaki Desk | 15 Jun 2021 7:30 AM GMTపశ్చిమ బెంగాల్ లో బీజేపీ కుదేలవుతోంది. సీఎం మమతా బెనర్జీ ధాటికి బీజేపీ ఖాళీ అవుతోంది. మెజార్టీ నేతలను ఆమె లాగేస్తున్నారు. పార్టీ వీడి బీజేపీలో చేరిన వారందరినీ వెనక్కి రప్పిస్తున్నారు. ఇక బీజేపీ నేతలపై బెంగాల్ లో టీఎంసీ నేతలు భారీగా దాడులు చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై ఫిర్యాదు చేయడానికి తాజాగా బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ వద్దకు వెళ్లారు.
ఈ కీలక భేటికి అందరు బీజేపీ ఎమ్మెల్యేలు రావాలని అధిష్టానం ఆదేశించింది. అయినా కూడా 23 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి రాకుండా బీజేపీకి షాక్ ఇచ్చారు. వీరంతా బీజేపీలో చేరిన ముకుల్ రాయ్ కు సన్నిహితులు అనే టాక్ కూడా వినిపిస్తోంది.
బెంగాల్ లో మొన్నటి ఎన్నికల్లో బీజేపీ 74 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంది. సువేందు అధికారిని శాసనసభాపక్ష నేతను చేశారు. తాజాగా గవర్నర్ వద్దకు వెళ్లింది కేవలం 50 మంది మాత్రమేనట.. మూడో వంతు ఎమ్మెల్యేలు బీజేపీకి హ్యాండ్ ఇచ్చిన వైనం చర్చనీయాంశమైంది.
23 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టీఎంసీ వైపు చూస్తున్నారని.. ఇప్పటికే వెళ్లిపోయిన కొందరు నేతలు బాహాటంగా మమతకు జై కొట్టినట్టుగా తెలుస్తోంది.దీంతో బెంగాల్ లో బీజేపీకి గట్టి షాక్ తగిలిందని ప్రచారం సాగుతోంది.