Begin typing your search above and press return to search.
మరో దుష్యంత్ చౌతాలా కాబోతున్న రేవంత్ రెడ్డి?
By: Tupaki Desk | 25 Oct 2019 8:20 AM GMTతాజాగా హర్యానా లో జరిగిన ఎన్నికలలో హంగ్ ఏర్పడింది. అధికారాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ను ఏ పార్టీ కూడా అందుకోలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కింగ్ మేకర్ లా మారింది.. జన్ నాయక్ జనతా పార్టీ (జేజేపీ). అంచనాలకు మించి సీట్లని సంపాదించి ..కింగ్ మేకర్ గా మారారు జేజేపీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా. 12 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న జేజేపీ.. ఏ పార్టీకి మద్దతు ఇస్తే.. ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు. దీనితో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ కీలక నేతలు దుష్యంత్ చౌతాలా చుట్టూ తిరుగుతున్నారు. తమ పార్టీకి ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని హామీ ఇచ్చే పార్టీకే తాను మద్దతు ఇస్తామని దుష్యంత్ చౌతాలా తేల్చి చెప్పారు. దీనితో ఇప్పుడు బీజేపీ , కాంగ్రెస్ ఆలోచనలో పడ్డాయి. జేజేపీ అండ లేకుండా ప్రభుత్వాన్ని రేపాటు చేయడం కూడా దాదాపుగా అసాధ్యం. దీనితో కాంగ్రెస్ కర్ణాటక తరహా రాజకీయానికి తెరతీయబోతుంది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రెండున్నర ఏళ్ళు ఒక పార్టీ .. మరో రెండున్నరేళ్లు ఒక పార్టీ కి ముఖ్యమంత్రి పదవి అని కాంగ్రెస్ జెజెపికి ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
హర్యానాలో నేషనల్ పార్టీలనే వణికిస్తోన్న దుష్యంత్ చౌతాలా అసలు ఎవరు .. దుష్యంత్ చౌతాలా.. ఓం ప్రకాశ్ చౌతాలా మనవడు. మాజీ ఉప ప్రధాని చౌధరీ దేవి లాల్ ముని మనవడు. 1988లో జన్మించిన దుష్యంత్.. 2014 ఎన్నికల్లో ఎంపీగా గెలిచి.. పిన్నవయస్కుడైన ఎంపీగా ఒక రికార్డు క్రియేట్ చేశారు. ఆ తరువాత 2018 డిసెంబర్ 9న ఆయన్ను ఇండియన్ నేషనల్ లోక్ దళ్ బహిష్కరించింది. ఆ పార్టీ అధినేతగా దుష్యంత్ చిన్నాన్న అభయ్ చౌతాలా ఉన్నారు. దీనితో ఐఎన్‌ఎల్‌డీ నుంచి బయటకొచ్చిన దుష్యంత్.. తన తాత పేరు వచ్చేలా జననాయక్ జనతా పార్టీని (జేజేపీ) ఏర్పాటు చేశారు. పార్టీ ఏర్పాటు అయ్యాక వచ్చిన జింద్ ఉపఎన్నికలో బరిలో దిగిన జేజేపీ ప్రధాన పార్టీలను ఆశ్చర్యపరుస్తూ రెండోస్థానంలో నిలిచింది. దుష్యంత్‌పై ప్రశంసలు గుప్పించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ఆయన పార్టీకి మద్దతు ప్రకటించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో జేజేపీ తరఫున పోటీ చేసిన దుష్యంత్.. బీజేపీకి చెందిన బ్రిజేంద్ర సింగ్ చేతిలో ఓటమిపాలైయ్యారు.
ఇక విషయానికొస్తే .... తెలంగాణ రాజకీయాలని ఒకసారి పరిసలిస్తే .. తెలంగాణ కాంగ్రెస్ లో కీలకనేతగా ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డి కూడా మరో దుష్యంత్ చౌతాలా కనిపిస్తున్నాడు. గతంలో తెలుగు దేశం పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత రాష్ట్రం విడిపోయిన తరువాత టీడీపీ కి తెలంగాణలో మనుగడ లేకపోవడంతో కాంగ్రెస్ లో చేరాడు. సీఎం కేసీఆర్ ని మాటలతో హడలెత్తించాలి అంటే రేవంత్ రెడ్డెరా అని పేరుతెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో కుమ్ములాటలు ఎక్కువైపోయాయి. ఇదే కాంగ్రెస్ ని బలహీన పరుస్తుంది. ఈ సమయంలో రేవంత్ రెడ్డి బయటకి వచ్చి కొత్త పార్టీ తో ప్రజల మధ్య కి వస్తే ... వచ్చే ఎన్నికలలో కింగ్ కాకపోయినా కూడా కింగ్ మేకర్ కావడం పక్కా . చూడాలి మరి రేవంత్ కూడా దుష్యంత్ చౌతాలా సొంత కుంపటి పెడతాడో ..లేక కాంగ్రెస్ లోనే కొనసాగుతాడో ..