Begin typing your search above and press return to search.

కర్ణాటకలో మరో ఎన్నికల నగారా

By:  Tupaki Desk   |   10 Nov 2019 11:28 AM GMT
కర్ణాటకలో మరో ఎన్నికల నగారా
X
కర్ణాటక రాష్ట్రంలో కుమారస్వామి ప్రభుత్వం పడిపోయిన సంగతి తెలిసిందే. ఆ బలపరీక్ష వేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిన కాంగ్రెస్, జేడీఎస్ 17మంది ఎమ్మెల్యేలపై నాటి స్పీకర్ అనర్హత వేటు వేశారు. దీంతో అప్పటి నుంచి ఖాళీగా ఉంటున్న ఆ సీట్లకు తాజాగా రెండు కోర్టు కేసుల్లో ఉండడంతో 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ప్రకటన జారీ చేసింది.

కర్ణాటక రాష్ట్రంలోని 15 అసెంబ్లీ స్థానాలతోపాటు హర్యానా, మహారాష్ట్రలో అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది.

ఈ నెల 11వ తేదీనుంచి ఈ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది. డిసెంబర్ 5న ఎన్నికలు నిర్వహించి 9న ఫలితాలు ప్రకటించేందుకు ఈసీ రెడీ అయ్యింది.

అయితే అనర్హతకు గురైన 17మందిని ఆరేళ్లపాటు ఎన్నికల్లో పాల్గొనకుండా స్పీకర్ అనర్హత వేటు వేశారు. దీనిపై వారంతా సుప్రీం కోర్టుకు ఎక్కారు. ఈనెల 13వ తేదీన సుప్రీం కోర్టు తీర్పు వెలువడనుంది. దాన్ని బట్టి వారు ఈ ఉప ఎన్నికల్లో పోటీచేస్తారా లేదా అన్నది తేలనుంది.