Begin typing your search above and press return to search.

మరో నిర్భయ ఘటన: కదులుతున్న బస్సులో అత్యాచారం

By:  Tupaki Desk   |   18 Jun 2020 9:30 AM IST
మరో నిర్భయ ఘటన: కదులుతున్న బస్సులో అత్యాచారం
X
దేశంలో ఎంతో మంది నిర్భయలు బలి అవుతున్నా.. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా అత్యాచారాల పరంపర మాత్రం ఆగడం లేదు. ఢిల్లీలో కదులుతున్న బస్సులో నిర్భయపై దారుణ అత్యాచారం తర్వాత కఠినమైన ‘నిర్భయ చట్టం’ తెచ్చారు. అయినా కామాంధుల ఆకృత్యాలకు అడ్డుకట్టపడడం లేదు. మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా ఢిల్లీ నిర్భయ ఘటన తరహాలోనే ఉత్తరప్రదేశ్ లో సేమ్ అలాంటి అత్యాచారమే జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గడ్ నుంచి నోయిడాకు బయలుదేరిన 25 ఏళ్ల మహిళ బస్సులో ప్రయాణం చేస్తున్న సమయంలో అత్యాచారానికి గురైంది.

కదులుతున్న బస్సులో బస్సు డ్రైవర్ ఆమె పై అత్యాచారం చేశాడు. ప్రతాప్ గడ్ లో బస్సు ఎక్కిన సమయంలో బస్సు డ్రైవర్ ఆమెకు వెనుక సీటు కేటాయించాడు. బస్సు ఎక్కే సమయంలోనే ఆమెపై అందులోనే ఉన్న మరో ఇద్దరు డ్రైవర్లు కన్నేశారు. లక్నో, మధుర మధ్య ప్రాంతంలో బస్సులోని మహిళపై అత్యాచారం చేసినట్లు సమాచారం.

నోయిడాలో దిగిన ఆ మహిళ తన భర్తకు జరిగిన విషయం చెప్పి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరు డ్రైవర్లలో ఒకరిని అరెస్ట్ చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు.