Begin typing your search above and press return to search.
విశాఖలో వైసీపీకి మరో అగ్ని పరీక్ష.. గెలిచి పరువు నిలుపుకునేనా ?
By: Tupaki Desk | 19 April 2021 8:53 AM GMTవిశాఖలో రాజకీయం గత కొద్ది రోజులుగా హాట్ హాట్‌గానే నడుస్తోంది. విశాఖను జగన్ ఎప్పుడు అయితే పరిపాలనా రాజధానిగా ప్రకటించారో అప్పటి నుంచి అక్కడ రాజకీయం వేడెక్కేసింది. ఆ తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ అంశం కూడా రాజకీయ పక్షాల మధ్య పెద్ద యుద్ధానికి కారణమైంది. ఇక కీలకమైన విశాఖ కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. ఇక్కడ ఎలాగైనా పాగా వేయాలని జగన్ ముందు నుంచి అనేక ప్రణాళికలు రచించారు. చివరకు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. అయితే టీడీపీ + వామపక్షాలు ఏకంగా 35 డివిజన్లలో పాగా వేయడం వైసీపీకి పెద్ద షాకే అనుకోవాలి.
వైసీపీ చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా 98 వార్డులకు గానూ 58 సీట్లతో వైసీపీ మేయర్ సీటుని గెలుచుకుంది. ఇలా గెలుచుకుందో లేదో అలా ఒక కార్పోరేటర్ సీటుకు ఉప ఎన్నిక వచ్చిపడింది. ఈ ఎన్నికల్లో 61వ డివిజన్ నుంచి వైసీపీ తరపున కార్పోరేటర్‌గా గెలిచిన దాడి సూర్యకుమారి ఇటీవల హఠాత్తుగా మృతి చెందారు. దీంతో త్వరలోనే ఈ డివిజన్‌కు ఉప ఎన్నిక రానుంది. అయితే సూర్య కుమారి హోరా హోరీ పోరులో కేవలం 500 ఓట్ల తేడాతో మాత్రమే విజయం సాధించారు. ఈ డివిజన్లో టీడీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అసలు మొన్న గెలవాల్సిన సీటే.. ఇక ఇక్కడ వామపక్షాలు కూడా స్ట్రాంగే.
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఎఫెక్ట్ ఇక్కడ ఎక్కువుగా ఉంది. ఇక ఇక్కడ ఉప ఎన్నిక జరిగినా ఈ సీటును వైసీపీకి ఎన్నిక లేకుండా ఏకగ్రీవంగా ఇచ్చేందుకు టీడీపీకి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఇక్కడ టీడీపీ తన అభ్యర్థిని రంగంలోకి దించడంతో పాటు వామపక్షాల మద్దతుతో గట్టిగా ఎన్నికలకు వెళితే ఈ డివిజన్లో హోరా హోరీ పోరు తప్పదు. అందుకే ఈ ఉప ఎన్నిక వైసీపీని కాస్త టెన్షన్ పెడుతుందనే నగర వైసీపీ నేతలు చెపుతున్నారు. ఇక ఇప్పటికే గ్రేటర్ విశాఖ ఎన్నికల తర్వాత అనేక అసమ్మతి జ్వాలలు ఎగసి పడుతున్నాయి.
మేయర్ పదవి ఆశించి భంగపడ్డ నగర పార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణతో పాటు డిప్యూటీ మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్న పలువురు నేతలు పార్టీకి దెబ్బేసేందుకు అదను చూసి ఉన్నారు. వంశీ కృష్ణ అయితే ఏకంగా తన పదవికి రాజీనామా చేస్తాననే చెప్పారు. ఈ అసమ్మతి జ్వాలల నేపథ్యంలో ఈ సిట్టింగ్ డివిజన్‌ను వైసీపీ నిలబెట్టుకోవడం అత్యవసరం..!