Begin typing your search above and press return to search.
కరోనా వైరస్ : భారత్ కోలుకోవాలంటే మరో ఐదేళ్లు ..2030 కి మూడో స్థానానికి!
By: Tupaki Desk | 26 Dec 2020 2:30 PM GMTకరోనా మహమ్మారి ప్రభావంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధల్లో ఒకటైన భారత్ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంది. ఓవైపు పడిపోతున్న జీడీపీ, స్టాక్ మార్కెట్ల పతనం, వ్యాపారాలపై ప్రభావం, ఇలా పలు అంశాలు భారత్‌ను దెబ్బతీశాయి. కరోనా కారణంగా ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా ఉన్న భారత్ ఆరోస్ధానానికి పడిపోయింది. అయితే లాక్ డౌన్ తర్వాత మళ్లీ అన్ని పుంజుకుంటున్నా కూడా భారత్ తిరిగి ఐదో స్ధానానికి చేరుకోవాలంటే ఐదేళ్లు పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కరోనా రాకముందే పడుతూ లేస్తూ ఉన్న భారత ఆర్ధిక వ్యవస్ధపై కరోనా ప్రభావం పిడుగుపాటులా మారింది. వైరస్ దెబ్బకు భారత ఆర్ధిక వ్యవస్ధ ప్రపంచవ్యాప్తంగా ఐదో స్ధానం నుంచి ఆరో స్ధానానికి దిగజారింది. అప్పటివరకూ ఆరో స్ధానంలో ఉన్న బ్రిటన్ మనల్ని వెనక్కి నెట్టి ఐదో స్ధానానికి ఎగబాకింది. వాస్తవానికి గతేడాది ఆరో స్ధానం నుంచి బ్రిటన్ ను వెనక్కి నెట్టి ఐదో స్ధానానికి చేరిన భారత్... కరోనా సమయంలో తిరిగి ఆరో స్ధానానికి చేరింది. దీంతో తిరిగి ఐదో స్ధానం ఎప్పుడు దక్కించుకుంటుందన్న చర్చ సాగుతోంది
ఆరో స్ధానం నుంచి భారత్ తిరిగి తన ఐదో స్ధానానికి రావాలంటే 2025 వరకూ ఆగాల్సిందే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ నిర్వహించిన అధ్యయనంలో భారత్ తిరిగి ఐదో స్ధానానికి రావాలంటే ఐదేళ్ల పాటు శ్రమించక తప్పదని తేల్చింది. ప్రస్తుతం భారత్, బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధలు, ఆయా దేశాల్లో నెలకొన్న పరిస్ధితుల ఆధారంగా చూస్తే 2024 వరకూ బ్రిటన్ స్ధానానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని అంచనా వేసింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులు చూస్తుంటే 2021లో భారత ఆర్ధిక వ్యవస్ధ తన పరిధిని 9 శాతం పెంచుకుంటుందని, 2022లో మరో 7 శాతం పెంచుకుంటుందని సీఈబీఆర్ రిపోర్ట్ తెలిపింది. 2035 నాటికి భారత్ జీడీపీ 5.8 శాతానికి పరిమితం అవుతుందని వెల్లడించింది.
దీని వల్ల భారత్ 2030 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా అవతరించడం ఖాయమని సీఈబీఆర్ అంచనా వేస్తోంది. జాతీయ వృద్ధి రేటు అనుకున్నంత వేగంగా లేకపోవడానికి ప్రధాన కారణాలను కూడా ఈ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం బ్యాంకింగ్ వ్యవస్ధలో నెలకొన్న సంక్షోభం, సంస్కరణలకు సిద్ధం కాకపోవడం, ప్రపంచ వాణిజ్యం క్షీణించడం వృద్ధి రేటు మందగమనానికి ముఖ్య కారణాలుగా పేర్కొంది. వీటన్నింటికంటే మించి ఈ ఏడాది ఎదురైన కరోనా సంక్షోభం భారత్‌ను దారుణంగా దెబ్బతీసినట్లు నివేదిక స్పష్టం చేసింది.