Begin typing your search above and press return to search.
మరో నలుగురికి మంత్రుల చాన్స్..మొత్తం 8మంది..
By: Tupaki Desk | 7 Jun 2019 10:07 AM GMTవైసీపీ శాసనసభాపక్షం తర్వాత జగన్ తన టీంను రెడీ చేసుకున్నారు. స్పీకర్ గా తమ్మినేని సీతారాంను ఇప్పటికే ఖరారు చేసిన జగన్ ఇప్పుడు మంత్రులుగా పలువురిని ఖరారు చేసినట్టు సమాచారం. ఈ మేరకు విజయసాయిరెడ్డి వారికి ఫోన్ చేసి మంత్రులుగా ప్రమాణ స్వీకారానికి రెడీగా ఉండాలని కోరినట్లు తెలిసింది.
శాసనసభాపక్ష సమావేశం అనంతరం జగన్ ఆదేశాల మేరకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి చెప్పారు. బొత్స సత్యానారాయణ - పెద్దిరెడ్డి - మేకపాటి గౌతం రెడ్డి - సుచరితలను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నామని.. రేపు మంత్రిగా ప్రమాణం చేయడానికి రెడీ కావాలని కోరినట్లు తెలిసింది.
తాజాగా మరో నలుగురికి మంత్రి పదవులు ఖాయమైనట్టు సమాచారం వెళ్లింది. విజయసాయిరెడ్డి నుంచి ఫోన్ రావడంతో వారు మంత్రులుగా ప్రమాణ స్వీకారానికి రెడీ అవుతున్నారు. తాజాగా ఫోన్ అందుకున్న వారిలో ధర్మానా కృష్ణదాస్ - బుగ్గన - కొడాలి నాని - పార్థసారథికి మంత్రి పదవులు ఖాయమయ్యాయి. వీరికి ఫోన్ చేసిన విజయసాయిరెడ్డి రేపు మంత్రులుగా ప్రమాణం చేయడానికి రెడీగా ఉండాల్సిందిగా కోరినట్టు సమాచారం. అయితే ధర్మానా కృష్ణ దాస్ అన్న అయిన ధర్మానా ప్రసాద్ రావుకు మంత్రిగా అవకాశం లేనట్టే కనిపిస్తోంది. శ్రీకాకుళం నుంచి కృష్ణదాస్ ను తీసుకోవడంతో ప్రసాద్ రావు పరిస్థితి ఏంటన్న ప్రశ్న ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.
మొత్తం 25మంది ఉండే ఏపీ కేబినెట్ లో ఇప్పటికి 8మందికి విజయసాయిరెడ్డి ఫోన్ చేసి మంత్రులుగా ఖాయం చేశారు. ఇంకా 17 మంత్రుల బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవి వస్తుందా లేదా అన్న ఆసక్తి మాత్రం పొలిటికల్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఆమెకు ఇంకా ఫోన్ రానట్టు సమాచారం.
కాగా వీరికి మంత్రుల శాఖలపై కూడా వైసీపీ అధిష్టానం - జగన్ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. శుక్రవారం రాత్రి కానీ.. శనివారం ఉదయానికి కానీ వీరికి ఏఏ శాఖలు కేటాయించాలనే దానిపై స్పష్టత రానుంది.