Begin typing your search above and press return to search.
వ్యాక్సిన్లపై మరో రచ్చ .. హ్యాకర్ల గ్రూప్ నుండి డేటా లీక్ , స్పష్టం చేసిన కేంద్రం !
By: Tupaki Desk | 11 Jun 2021 5:30 AM GMTకరోనా వ్యాక్సిన్ల పై గత కొన్ని రోజులుగా కొనసాగుతోన్న వివాదాలు ముదురుతున్నాయి. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఆయువుపట్టు లాంటి 'కోవిన్' డిజిటల్ పోర్టల్ తాజాగా టార్గెట్ అయింది. టీకాల పంపిణీ మొత్తం కోవిన్ ద్వారానే సాగుతోన్న క్రమంలో ఆ పోర్టల్ హ్యాకింగ్ కు గురైందని, అందులోని డేటాను డార్క్ నెట్ లో అమ్మకానికి ఉంచారంటూ గురువారం సాయంత్రం నుంచి పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం సదరు రిపోర్టులను తోసిపుచ్చింది. కోవిన్ పోర్టల్ సురక్షితంగా ఉందని, హ్యాకింగ్ కానీ, ఎలాంటి డేటా లీకేజీకానీ జరగలేదని స్పష్టంచేసింది. దేశంలో వ్యాక్సిన్ తీసుకోవాలనుకునేవారంతా తప్పనిసరిగా కోవిన్ యాప్ లేదా వెబ్ సైటులో తమ వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటుండటం తెలిసిందే.
కోవిన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మొబైల్ ఫోన్‌కి వచ్చిన ఓటీపీ ద్వారా లాగిన్ కావాలి. అందులో వ్యక్తిపేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్‌తో పాటు కొన్ని వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాల వివరాలు నమోదు చేసుకోవాలి. దేశంలో ఇప్పటికే కోట్లాది మంది తమ వివరాలను కోవిన్ పోర్టల్ లో నమోదు చేసుకున్నారు. ఒకే ఒక్క డిజిటల్ వేదిక ద్వారా ఇన్ని కోట్ల మందికి టీకాలు అందించే ప్రక్రియ కొనసాగించడం సరైందికాదని సుప్రీంకోర్టు ఇటీవల వ్యాఖ్యానించడం తెలిసిందే. ఈ క్రమంలో కోవిన్ పోర్టల్ ఎంతవరకు సురక్షితం, యూజర్ల డేటాకు సేఫ్టీ ఉందా, అనే ప్రశ్నలు తలెత్తుతున్న క్రమంలోనే చీకటి ప్రపంచం నుంచి వెలువడిన వార్త కలకలం రేపింది. కోవిన్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వినియోగదారుల డేటా డార్క్ వెబ్ లో అమ్మకానికి ఉన్నట్లు హ్యాకర్స్ గ్రూప్ డార్క్ లీక్ మార్కెట్ పేర్కొంది.
భారత్ లో కొవిడ్ టీకా వేసుకున్న 150 మిలియన్ల మంది పేరు, మొబైల్ నంబర్, ఆధార్ ఐడీ, జీపీఎస్ వివరాలతో కూడిన సమాచారాన్ని 800 డాలర్లకు అమ్మకానికి ఉంచినట్లు తెలిపింది. ఈ ఉదంతపై జాతీయ, ప్రాంతీయ మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి. ఇప్పటిదాకా కోవిన్ యాప్ ద్వారా టీకా తీసుకున్న, రిజిస్ట్రేషన్ చేసుకున్నవారంతా ఆందోళనకు గురయ్యారు. దీంతో కేంద్రం రంగంలోకి దిగింది. మీడియా రిపోర్టుల్లో, ఇంటర్నెట్ లో ప్రచారం జరుగుతున్నట్లు కోవిన్ యాప్ కు సంబంధించి ఎలాంటి ఒడిదుడుకులు జరగలేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కోవిన్ పోర్టల్ హ్యాకింగ్ కు గురైందనే ప్రచారం వట్టిదేనని, యూజర్ల డేటా లీకైందన్న మాట కూడా అవాస్తవమంటూ గురువారం అర్ధరాత్రి తర్వాత ఆ శాఖ ఒక అధికారిక ప్రకటన చేసింది. కాగా, ఈ ఉదంతపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు చెందిన నిపుణులు దర్యాప్తు చేస్తున్నారని, డేటా లీకైందనే ఆరోపణలకు కచ్చితంగా సమాధానం చెబుతామని, ప్రస్తుతానికి ఎలాంటి లీకేజీ జరగలేదని కేంద్రం వెల్లడించింది.