Begin typing your search above and press return to search.
తల్లిని కూతురు చంపేసిన దుర్మార్గం.. ఈసారి గుంటూరులో
By: Tupaki Desk | 1 Nov 2019 3:00 AM GMTసరిగ్గా వారం కూడా కాలేదు.. కర్చీపుల్ని మార్చినట్లుగా ప్రియుళ్లను మార్చేస్తున్న కూతురు తీరును తప్ప పడుతూ.. మందలించిన తల్లిని చంపేసిన దుర్మార్గపు ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటనను వినేందుకు సైతం ఇష్టపడని వారెందరో. సరిగ్గా.. అలంటి ఘటనే తాజాగా ఏపీలోని గుంటూరులో చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని హయత్ నగర్ లో ప్రియుడి మోజులో అమ్మను చంపేస్తే.. తాజా విషాదంలో ఆస్తి కోసం అమ్మను అంతమొందించిన వైనం చూస్తే.. మానవ సంబంధాలు ఏమైపోతున్నాయన్న సందేహం కలుగక మానదు. విన్నంతనే వణుకు పుట్టే ఈ దుర్మార్గమైన దారుణంలోకి వెళితే..
గుంటూరులోని నగరపాలెంకు చెందిన ఆలపాటి లక్ష్మి.. రమేశ్ దంపతులకు హేమంత్ అనే కుమారుడు.. భార్గవి అనే కుమార్తె ఉన్నారు. పన్నెండేళ్ల క్రితం కుమార్తెకు అచ్చంపేట మండలం పుట్ల గూడెంకు చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది. వారి పెళ్లి జరిగిన తొమ్మిది నెలలకే లవ్ ఫెయిల్యూర్ కారణంగా హేమంత్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఏడాది క్రితమే భార్గవి తండ్రి కూడా మరణించారు. దీంతో తల్లి లక్ష్మీ ఒక్కతే గుంటూరులోని అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఒంటరిగా ఉన్న ఆమె కూరగాయల వ్యాపారం చేస్తోంది. ఇలాంటి పరిస్థతుల్లో ఆమెకు కిశోర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది.
అయితే.. ఆమె పేరు మీద తాడేపల్లి సమీపంలోని కుంచనపల్లి వద్ద ఒకటిన్నర సెంట్ల స్థలం.. అమరావతి పరిధిలోని తమ్మవరంలో 17 సెంట్ల పొలం ఉంది. ఈ ఆస్తి మొత్తాన్ని తల్లి ఎక్కడ కిశోర్ కు రాసేస్తుందో అన్న అనుమానంతో కుమార్తె భార్గవి తల్లిని చంపేయాలని డిసైడ్ అయ్యింది. ఇందుకోసం భర్త రామాంజనేయులు.. అతడి బాబాయ్ లతో కలిసి చంపేశారు. మద్యం సేవించే లక్ష్మీ మత్తులో ఉన్న వేళ.. ఆమెను చంపి.. ఆమె మెడలో ఉన్న బంగారాన్ని.. ఇంట్లో ఉన్న రూ.39వేల నగదును దోచేశారు. ఏమీ ఎరగనట్లు తమ ఇళ్లకు తిరిగి వచ్చి ఉండిపోయారు.
లక్ష్మీ మరణించి ఉండటాన్ని చూసిన పని మనిషి.. ఆ సమాచారాన్ని కుమార్తెకు ఇవ్వటం.. ఏమీ తెలీనట్లుగా వచ్చి శోకాలు పెడుతూ.. అనారోగ్యంతో మరణించినట్లుగా అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే.. లక్ష్మీ మెడలో ఉండాల్సిన బంగారు గొలుసు లేకపోవటంతో ఆమె బావ గోవింద్ కు అనుమానం వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ షురూ చేసినంతనే..ఆస్తి కోసం తన తల్లిని తాము చంపినట్లుగా లక్ష్మీ.. ఆమె భర్తతో పాటు.. ఆయన బాబాయ్ లు కలిసి హత్య చేసిన వైనాన్ని ఒప్పుకున్నారు. ఈ ఘటన సంచలనంగా మారింది. ఆస్తి కోసం తల్లిని చంపేయటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.