Begin typing your search above and press return to search.
పాక్ లో హిందూ యువతి కిడ్నాప్.. దారుణం
By: Tupaki Desk | 3 Sep 2019 7:04 AM GMTదాయాది దేశం పాకిస్తాన్ లో అల్ప సంఖ్యాకులైన హిందువులకు రక్షణ లేకుండా పోతోంది. ఇటీవలే ఓ సిక్కు యువతిని కిడ్నాప్ చేసి బలవంతంగా ముస్లిం మతంలోకి మార్చి పెళ్లి చేయడం దుమారం రేపింది. తాజాగా మరో హిందూ యువతిని కిడ్నాప్ చేసి ఓ ముస్లిం వ్యక్తితో పెళ్లి చేసుకోవడం కలకలం రేపింది.
తాజాగా పాకిస్తాన్ లోని సింధూ ప్రావిన్స్ లో ఆగస్టు 29న బీబీఏ చదువుతున్న ఓ హిందూ యువతిని ఆమె క్లాస్ మేట్ అయిన బాబర్ అమన్ అనే తోటి ముస్లిం క్లాస్ మేట్ కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. కిడ్నాప్ చేశాక పీటీఐ పార్టీ కార్యకర్త బేగ్ ఇంటికి తీసుకెళ్లి అమ్మాయిని బలవంతంగా ముస్లిం మతంలోకి మార్చినట్టు సమాచారం. అనంతరం బలవంతంగా బాబర్ అమన్ తో పెళ్లి చేసినట్లు సమాచారం.
పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీకి చెందిన మీర్జా దిలావర్ బేగ్ తో కలిసి హిందూ యువతిని కిడ్నాప్ చేసినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాబర్ అమన్ సోదరుడిని అరెస్ట్ చేశారు. బాబర్ అమన్, కిడ్నాప్ కు గురైన యువతి ఎక్కడున్నారో చెప్పాలంటూ ఒత్తిడి తెస్తున్నారట..
కాగా హిందూ, సిక్కు యువతులను బలవంతంగా మతమార్పిడులు చేయడంపై అల్ పాకిస్తాన్ హిందూ పంచాయతీ అనే హిందూ ఎన్టీవో సంస్థ తీవ్రంగా ఖండించింది. దీనిపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.పంజాబ్ ప్రావిన్స్ లోని ఓ గురుద్వారాలో పూజారిగా పనిచేస్తున్న వ్యక్తి కూతురును కిడ్నాప్ చేసుకున్నా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని.. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని హిందూ సంఘం ఆరోపించింది. ఈ నేపథ్యంలో హిందూ యువతుల కిడ్నాప్ వ్యవహారంపై ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు పాకిస్తాన్ లోని మైనార్టీలైన హిందువులు సిద్ధమయ్యారు.