Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యే సీతక్క మరో ఘనత!
By: Tupaki Desk | 11 Oct 2022 10:38 AM GMTతెలంగాణలో ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతంలో 11 ఏళ్లు నక్సలైటుగా ఉన్నారు. ఆ తర్వాత జనజీవన స్రవంతిలోకి వచ్చిన ఆమె కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం తెలంగాణ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, ఛత్తీస్‌గఢ్ మహిళా కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా పదవుల్లో ఉన్నారు.
గతంలో కరోనా సమయంలోనూ, వరదల సమయంలోనూ సీతక్క సాహసం అందరి ప్రశంసలు అందుకుంది. వాహనాలు వెళ్లలేని దారుల్లోనూ, చిట్టడవిలోనూ ఆమె కాలి నడకనే పర్యటించి ప్రజలకు నిత్యావసరాలు అందించారు. చేతనైనంత సహాయం అందజేశారు. సమస్యలు ఎక్కడుంటే అక్కడ సీతక్క ఉంటారనే పేరు తెచ్చుకున్నారు.
ఓవైపు ఎమ్మెల్యేగా పార్టీకి సేవలందిస్తూ.. మరోవైపు ప్రజలకు సేవలందిస్తున్న సీతక్క ఉన్నత విద్యనూ వదల్లేదు. ఏకంగా ఆమె పీహెచ్‌డీ పూర్తి చేయడం విశేషం. అది కూడా వలస గిరిజనుల వెనుకబాటుపై ఆమె పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఈ మేరకు ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో వరుస పోస్టులు చేశారు.
సీతక్క ట్వీట్లు ఇలా ఉన్నాయి.... నా చిన్నతనంలో నేనెప్పుడూ నక్సలైట్ అవుతానని అనుకోలేదు, నక్సలైట్‌గా ఉన్నప్పుడు లాయర్‌ని అవుతానని, లాయర్‌గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అవుతానని, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పీహెచ్‌డీ చేస్తానని అనుకోలేదు. ఇప్పుడు మీరు నన్ను రాజకీయ శాస్త్రంలో డాక్టర్ అనసూయ సీతక్క పీహెచ్‌డీ అని పిలవవచ్చు.
ప్రజలకు సేవ చేయడం మరియు జ్ఞానాన్ని పొందడం నా అలవాటు. నా చివరి శ్వాస వరకు నేను దీన్ని ఎప్పటికీ ఆపను. నా పీహెచ్‌డీ గైడ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వీసీ ప్రొఫెసర్ టి.తిరుపతిరావు సర్, ప్రస్తుత మణిపూర్ విశ్వవిద్యాలయ చాన్సలర్, హెచ్‌ఓడీ ప్రొఫెసర్ ముసలయ్య సర్, ప్రొఫెసర్ అశోక్ నాయుడు సర్, బివోఎస్. ప్రొఫెసర్ చంద్రు నాయక్ సార్‌కు నా కృతజ్ఞతలు.
పొలిటికల్ సైన్స్‌లో నా పీహెచ్‌డీ టాపిక్ (సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ డిప్రివేషన్ ఆఫ్ మైగ్రెంట్ ట్రైబల్స్ ఆఫ్ ఎరస్టవైల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ - ఎ కేస్ స్టడీ ఆఫ్ గొట్టి కోయ ట్రైబ్స్ ఇన్ వరంగల్, ఖమ్మం డిస్ట్రిక్ట్స్) ను పూర్తి చేయడానికి నా పక్షాన నిలిచిన ప్రతి ఒక్కరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ ఎమ్మెల్యే సీతక్క వరుస ట్వీట్లు చేశారు.
సీతక్క పీహెచ్‌డీ విషయం తెలిసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆమెను అభినందిస్తున్నారు. ఆమె ట్వీట్ కు స్పందనగా అభినందనలతో కామెంట్లు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం సీతక్క మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.