Begin typing your search above and press return to search.

వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన మరో ఇండియన్ క్రికెటర్ !

By:  Tupaki Desk   |   22 Nov 2021 5:33 AM GMT
వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన మరో ఇండియన్ క్రికెటర్ !
X
క్రికెటర్‌ ఉన్ముక్త్‌ చంద్‌ పెళ్లి చేసుకొని మూడు ముళ్ల బంధం లోకి అడుగుపెట్టాడు. తన చిరకాల ప్రేయసి సిమ్రన్‌ ఖోస్లాను వివాహం చేసుకున్నాడు. అత్యంత సన్నిహితులు, బంధువుల సమక్షంలో నవంబరు 21న వీరి వివాహం జరిగింది. ఆ వివాహ వేడుకకి సంబంధించిన ఫొటోలను ఉన్ముక్త్‌,సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేయగా వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో నూతన జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా దేశవాళీ క్రికెట్‌లో అద్బుత ప్రదర్శన కనబరిచిన ఉన్ముక్త్‌ చంద్‌.. అండర్‌-19 వరల్డ్‌కప్‌ గెలిచిన భారత జట్టుకు సారథిగా వ్యవహరించాడు. అతడి కెప్టెన్సీలోనే 2012 ప్రపంచకప్‌ ఫైనల్‌ లో ఆస్ట్రేలియాను ఓడించి భారత్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది.

2012లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్‌లో ఉన్ముక్త్ చంద్ విధ్వంసకర బ్యాటింగ్‌లో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ ఏడాది భారత జట్టు వరల్డ్ కప్ గెలవడంతో ఉన్ముక్త్ కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాపై బాదిన సెంచరీని ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు. ఉన్ముక్త్ చంద్ బ్యాటింగ్ పవర్‌కు ఆ సెంచరీ ఒక నిదర్శనం. అండర్ - 19 వరల్డ్ కప్ తర్వాత.. అతడు కాబోయే కోహ్లీ అని అందరూ ప్రశంసించారు. కెప్టెన్ మెటీరియల్ అని అభినందించారు. అదే ఏడాది ఐపీఎల్ డీల్ కూడా కుదుర్చుకున్నాడు. 2013లోనే ఉన్ముక్త్ చంద్ 'ది స్కై ఈజ్ ది లిమిట్' అనే పుస్తకం రాశాడు. తన క్రికెటింగ్ కెరీర్ గురించి అద్భుతంగా వివరించాడు. ఉన్ముక్త్‌లోని రచయిత అప్పుడే ప్రపంచానికి తెలిసింది.

స్కూల్‌ లో చదువుకునే రోజుల్లోనే ఉన్ముక్త్ చంద్ రంజీ ట్రోఫీ ఆడాడు. అంతే కాకుండా తన నాలుగవ మ్యాచ్‌ లోనే ఉన్ముక్త్ సెంచరీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇండియా ఏ జట్టుకు కెప్టెన్‌ గా వ్యవహరిస్తూ, విదేశాల్లో మంచి విజయాలు అందించాడు. ఐపీఎల్‌ లో ఢిల్లీ డేర్ డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ తరపున ఉన్ముక్త్ ఆడాడు. కానీ సరైన అవకాశాలు లభించక ఐపీఎల్‌ లో ఎక్కువ కాలం కొనసాగలేకపోయాడు. దేశవాళీ క్రికెట్‌లో ఫామ్ కోల్పోవడంతో ఢిల్లీ జట్టు అతడిని పక్కకు పెట్టింది. దీంతో ఉన్ముక్త్ చంద్ ఢిల్లీ జట్టును వదిలి ఉత్తరాఖండ్‌కు షిఫ్ట్ అయ్యాడు.

కానీ అక్కడ కూడా పెద్దగా రాణించకపోవడంతో అవకాశాలు సన్నగిల్లాయి.యూఎస్ ఏ లో ప్రొఫెషనల్ క్రికెట్ లీగ్స్‌ లో ఆడటానికి ఉన్ముక్త్ చంద్ పలు ప్రయత్నాలు చేశాడు. అగస్టు 13న తాను భారత క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆ మరుసటి రోజు ఉన్ముక్త్ చంద్ అమెరికాలోని మేజర్ క్రికెట్ లీగ్‌ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అక్కడ మైనర్‌ లీగ్‌ క్రికెట్‌ లో తన ప్రతిభను నిరూపించుకున్న 28 ఏళ్ల ఉన్ముక్త్‌ చంద్‌... బిగ్‌బాష్‌ లీగ్‌కు సంతకం చేసిన తొలి భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. మెల్‌ బోర్న్‌ రెనెగేడ్స్‌ తరఫున అతడు బరిలోకి దిగనున్నాడు. ఇక ఉన్ముక్త్‌ భార్య సిమ్రన్‌ ఫిట్‌ నెస్‌, న్యూట్రిషన్‌ కోచ్‌ గా గుర్తింపు తెచ్చుకున్నారు.