Begin typing your search above and press return to search.

సహజీవనంలో శృంగారం.. రేప్ కాదు..

By:  Tupaki Desk   |   6 Jan 2019 11:08 AM GMT
సహజీవనంలో శృంగారం.. రేప్ కాదు..
X
పెళ్లికి ముందు శృంగారం తప్పు కాదని సుప్రీం కోర్టు అప్పట్లో తీర్పు నిచ్చింది. అలాగే ఇటీవలే ట్రాన్స్ జెండర్లు, లెస్బియన్ల శృంగారం కూడా నేరం కాదని చారిత్రక తీర్పునిచ్చింది. ఇవే కాదు.. వివాహేతర సంబంధాల్లో తప్పంతా పురుషుడిదే అన్నట్టుగా ఉన్న పాతచట్టాన్ని కూడా కోర్టు కొట్టివేసి పురుషులకు ఊరట నిచ్చింది. ఇలా శృంగారం విషయంలో అందరికీ స్వేచ్ఛనిచ్చేలా సుప్రీం కోర్టు తీర్పులు ఇటీవల వెలువడ్డాయి. తాజాగా మరో కేసులో పురుషులకు ఊరటనిచ్చేలా తీర్పును ఇచ్చింది.

ముంబైకి చెందిన ఒక డాక్టర్ తో నర్స్ కొద్దికాలంగా సహజీవనం చేసింది. ఆ సమయంలో ఇద్దరూ ఇష్టంతో శృంగారం చేసుకున్నారు. ఆ తర్వాత కొద్దికాలానికి గొడవలతో విడిపోయారు. ఆ నర్సు తనను డాక్టర్ రేపు చేశాడని.. చాలాసార్లు లొంగదీసుకున్నాడని.. మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కేసు సుప్రీం కోర్టు వరకూ వెళ్లింది.

ఈ కేసులో సుప్రీం కోర్టు తాజాగా చారిత్రిక తీర్పునిచ్చింది. సహజీవనంలో ఉన్నప్పుడు ఇద్దరూ ఇష్టపడి శృంగారంలో పాల్గొని తర్వాత గొడవలతో రేప్ కేసులు పెడితే కుదరదు అంటూ కోర్టు తీర్పునిచ్చింది. ప్రేమ, సహజీవనంలో శృంగార సంబంధాన్ని కలిగి ఉంటే.. ఆ ఏ కారణం చేత అయినా విడిపోయినా.. పెళ్లి చేసుకోలేకపోయినప్పుడు ఆ శృంగార సంబంధాన్ని రేప్ గా పరిగణించలమేని కోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది.

తాజాగా మీటూ పేరుతో చెలరేగిపోతున్న మహిళలకు తాజా సుప్రీం కోర్టు తీర్పు పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. ఎన్నో ఏళ్ల కిందట అంగీకారంతో శృంగారంలో పాల్గొని ఇప్పుడు మీటూ అంటూ మహిళా మణులు ఉద్యమిస్తున్నారు. సహజీవనంలో, ఇష్టంతో పాల్గొన్న సెక్స్ నేరం కాదని సుప్రీం తాజా తీర్పు పురుష పుంగవులకు గొప్ప ఊరటనిచ్చింది. అదే సమయంలో మీటూ ఉద్యమం పేరుతో యాగీ చేస్తున్న మహిళలకు సుప్రీం తీర్పు శరాఘాతంగా మారింది.