Begin typing your search above and press return to search.

మరో కేసీఆర్ స్కీమ్ ఏపీలో కాపీ

By:  Tupaki Desk   |   6 Jan 2019 11:13 AM GMT
మరో కేసీఆర్ స్కీమ్ ఏపీలో కాపీ
X
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ప్రతి దసరా పండుగకు తెలంగాణలోని దాదాపు 95లక్షల మంది మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నింటిలోకి గొప్ప విజయం సాధించిన స్కీమ్ గా ఇది నిలిచింది. 2017లో ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల పథకం ఫ్లాప్ అయ్యింది. అప్పుడు నాణ్యతలేని సూరత్ చీరలు పంపిణీ చేయడంతో మహిళలు తిరస్కరించి కాల్చివేసి నిరసన తెలిపారు. కానీ 2018లో సిరిసిల్ల చేనేతన్నలతో నాణ్యమైన పట్టు చీరలలాంటి వాటిని తయారు చేయించి నాణ్యమైనవి పంచారు. ఈ చీరలు మహిళల మనసులను చూరగొన్నాయి.

చీరలు తీసుకున్న మొత్తం 95 లక్షల మంది కేసీఆర్ కు ఓటు వేయకపోయినా .. ఇటీవల ఎన్నికల్లో బతుకమ్మ చీరల ప్రభావంతో కేసీఆర్ కు భారీగానే ఓట్ల వాన కురిసింది.

కేసీఆర్ బతుకమ్మ చీరల పథకం ఇప్పుడు ఏపీ టీడీపీ నేతలను తీవ్రంగా ఆకర్షిస్తోంది. రానున్న శాసన సభ ఎన్నికలకు ముందు మహిళలకు ఎరవేసేలా వారికి చీరలు పంపిణీ చేయాలని యోచిస్తున్నారట..

తెలంగాణలో బతుకమ్మ పెద్ద పండుగగా చేసుకుంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి అంతే వైభవంగా చేసుకుంటారు. అందుకే ఈ సంక్రాంతికి మహిళలకు చీరలు పంచాలని మొదట టీడీపీ సీనియర్ నాయకుడు , తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మొదట నిర్ణయించారు. తన నియోజకవర్గంలోని మహిళా ఓటర్లు 65000 మందికి చీరలను పంపిణీ చేయనున్నట్టు జేసీ ప్రకటించారు.

ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే రాజకీయాల్లో పోటీచేయనని ప్రకటించారు. తన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు తన కుమారుడు అస్మిత్ రెడ్డిని రంగంలోకి దించారు. తాడిపత్రి నుంచి వచ్చే ఎన్నికల్లో అస్మిత్ రెడ్డినే నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే బతుకమ్మ చీరలను పంపిణీచేసి గెలుపునకు బాటలు వేయాలని యోచిస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ స్కీంలను ఏపీ టీడీపీ నేతలు కాపీ కొడుతున్నారు. కేసీఆర్ పాలన బాగా లేదంటున్న వారే ఆయన స్కీములు ఫాలో కావడం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ జేసీ స్కీం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి..