Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో మరో కీచక తండ్రి ..కన్న కూతురినే...

By:  Tupaki Desk   |   1 Nov 2019 7:03 AM GMT
హైదరాబాద్ లో మరో కీచక తండ్రి ..కన్న కూతురినే...
X
ఈ సమాజం తల దించుకునే సంఘటన ఒకటి తాజాగా జరిగింది. ఈ ఘటన గురించి తెలుసుకుంటే అసలు ఈ సమాజం ఎటువైపు వెళ్తుందో అని అనిపించకమానదు. టెక్నాలజీ అంతకంతకూ పెరిగిపోతున్న ఈ ఆధునిక యుగంలో కూడా ఆడపిల్లలు అంటే తక్కువగా చూస్తున్నారు. ప్రస్తుతం ఆడపిల్లలు అన్నింటిలో ముందున్నారు. కానీ , ఎవరూ కూడా ఆడపిల్ల పుట్టాలని కోరుకోవడంలేదు. ఆడపిల్ల అంటే సాక్ష్యాత్ ఆ శ్రీమహాలక్ష్మి అంటారు..కానీ , అంతటి శ్రీమహాలక్ష్మినే పుట్టిన వెంటనే ప్రాణాలతోనే పాతిపెట్టాలని ప్రయత్నం చేసారు. ఇక్కడ మరోఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ..ఆ పాపని బ్రతికుండగానే పూడ్చడానికి తీసుకువెళ్ళింది స్వయానా తండ్రి , తాతయ్య కావడం గమనార్హం.

కడుపులో పరుగుతున్న ఆడపిల్లలకి సైతం వణుకు పెట్టించే ఈ సంఘటన హైదరాబాద్ లో జరిగింది. సికింద్రాబాద్ దగ్గరలో ఉన్న జూబ్లీ బస్ స్టాప్ దగ్గర బ్రతికి ఉన్న పాపని గుంత తీసి పూడ్చి పెట్టాలని ప్రయత్నం చేసారు. కానీ , ఒక ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారం తో రంగంలోకి దిగిన పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకోని , ఆ పాప ప్రాణాలని కాపాడారు.

కుమార్ అనే ఒక ఆటో డ్రైవర్ కి జూబ్లీ బస్ స్టాప్ దగ్గర అనుమానాస్పద పరిస్థితులలో ఇద్దరు కనిపించారు. వారి చేతిలో ఎదో ఉన్నట్టు గుర్తించాడు. అక్కడే ఉండి వారిని చూస్తున్న డ్రైవర్ కి కాసేపటికి దిమ్మతిరిగింది. అప్పటివరకు వారి చేతుల్లో ఉన్నది ఒక పాప అని తెలుసుకున్నాడు. ఈ లోపే వారు ఎవరూ లేని ప్రదేశానికి వెళ్లి .. పాపని పూడ్చడానికి గుంత కూడా తొవ్వేసారు. ఈ సమయంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన ఆటో డ్రైవర్ వెంటనే ఈ విషయం గురించి పోలీసులకి తెలిపాడు.

దీనితో ఆఘమేఘాల మీద పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులు ఏమి చేస్తున్నారు అని అడగ్గా ..పాప చనిపోయింది అని పోలీసులని నమ్మించే ప్రయత్నం చేసారు. కానీ , ఆ పాప చేతులు , కాళ్ళు కదపడంతో వారి అసలు బండారం బయటపడింది. ఆడపిల్ల పుట్టింది అనే కోపం తో వారు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తుంది. పోలీసులు నిందితులను ఇద్దరినీ అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు, అలాగే పాపని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారు తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందినవారని పోలీసులు తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.