Begin typing your search above and press return to search.
ప్రజల జేబులుఖాళీ చేసేందుకు కొత్త ఎత్తు వేసిన మోడీ సర్కారు
By: Tupaki Desk | 12 Nov 2021 1:30 PM GMTమోడీ మాష్టారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్.. డీజిల్ ధరలకు సంబంధించి కీలకమైన మార్పు చేయటం తెలిసిందే. అప్పటివరకు అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగా.. ఏ రోజుకు ఆ రోజు పెట్రోల్.. డీజిల్ ధరల్ని పెంచటం.. తగ్గించటం లాంటివి లేకుండా.. భారీ మార్పులు చేర్పులు చోటు చేసుకున్నప్పుడు మాత్రమే ధరల్ని పెంచటమో తగ్గించటమో చేసేవారు. అలాంటి వాటితో లాభం కంటే నష్టమే ఎక్కువని.. ప్రజల్ని ఉద్దరించటమే తమ లక్ష్యంగా పేర్కొంటూ కొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఏ రోజుకు ఆ రోజు పెట్రోల్.. డీజిల్ ధరల్ని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తర్వాతేమైందో తెలిసిందే.
తాజాగా అలాంటి నిర్ణయాన్నే మరొక కీలక అంశంలో కేంద్రం నిర్ణయం తీసుకునేందుకు వీలుగా పావులు కదుపుతోంది. ఇప్పుడు ఎలా అయితే రోజువారీగా సమీక్ష జరిపి.. పెట్రోల్.. ధరల్ని డిసైడ్ చేస్తారో.. అదే తరహాలో విద్యుత్ బిల్లులపై ప్రతి నెలా నిర్ణయం తీసుకునేలా కొత్త విధానాన్నితీసుకురావాలన్న ఆలోచనలో కేంద్రంలోని మోడీ సర్కారు ఉన్నట్లుగా చెబుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే.. ఈ తరహా బాదుడుకు తెర తీసినట్లుగా సమాచారం. ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రతి ఒక్కరి జేబులు చిల్లుపడేలా నిర్ణయం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
విద్యుదుత్పత్తికి వినియోగించే బొగ్గు.. గ్యాస్ ధరల్లో పెరుగుదల భారాన్ని ఎప్పటికప్పుడు వినియోగదారులపై మోపి ప్రతి నెలా ఎఫ్ఎస్ఏ రూపంలో వసూలు చేయాలని రాష్ట్రాల్ని కేంద్రం ఆదేశించింది. తాజాగా ఈ కొత్త విధానాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని చెబుతూ రాష్ట్రాలకు.. కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసినట్లుగా చెబుతున్నారు. విద్యుత్ సంస్థలపై పెరుగుతున్న వ్యవ భారాల్ని ఎప్పటికప్పుడు వినియోగదారులపై బదలాయించి వసూలు చేసుకోవటానికి వీలుగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అక్టోబరు 22న విద్యుత్ నిబంధనలు2021 పేరుతో ప్రకటించారు.
ఇందన సర్దుబాటు ఛార్జీలను ఏ నెలకు ఆ నెల వసూలు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. ఒకవేళ కేంద్రం ఆదేశాల్ని అమలు చేయకూడదని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా భావిస్తే.. అందుకు తగ్గట్లు నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఉన్నట్లుగాతెలుస్తోంది. విద్యుత్ చట్టంలోని సెక్షన్ 65 ప్రకారం ముందస్తుగా సబ్సిడీ చెల్లించి వినియోగదారులపై భారం పడకుండా చర్యలు తీసుకునే వెసులుబాటు కల్పించారు. మరి.. ఈ వెసులుబాటును ఎన్ని రాష్ట్రాలు వినియోగించుకుంటాయో చూడాలి.
తాజాగా అలాంటి నిర్ణయాన్నే మరొక కీలక అంశంలో కేంద్రం నిర్ణయం తీసుకునేందుకు వీలుగా పావులు కదుపుతోంది. ఇప్పుడు ఎలా అయితే రోజువారీగా సమీక్ష జరిపి.. పెట్రోల్.. ధరల్ని డిసైడ్ చేస్తారో.. అదే తరహాలో విద్యుత్ బిల్లులపై ప్రతి నెలా నిర్ణయం తీసుకునేలా కొత్త విధానాన్నితీసుకురావాలన్న ఆలోచనలో కేంద్రంలోని మోడీ సర్కారు ఉన్నట్లుగా చెబుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే.. ఈ తరహా బాదుడుకు తెర తీసినట్లుగా సమాచారం. ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రతి ఒక్కరి జేబులు చిల్లుపడేలా నిర్ణయం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
విద్యుదుత్పత్తికి వినియోగించే బొగ్గు.. గ్యాస్ ధరల్లో పెరుగుదల భారాన్ని ఎప్పటికప్పుడు వినియోగదారులపై మోపి ప్రతి నెలా ఎఫ్ఎస్ఏ రూపంలో వసూలు చేయాలని రాష్ట్రాల్ని కేంద్రం ఆదేశించింది. తాజాగా ఈ కొత్త విధానాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని చెబుతూ రాష్ట్రాలకు.. కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసినట్లుగా చెబుతున్నారు. విద్యుత్ సంస్థలపై పెరుగుతున్న వ్యవ భారాల్ని ఎప్పటికప్పుడు వినియోగదారులపై బదలాయించి వసూలు చేసుకోవటానికి వీలుగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అక్టోబరు 22న విద్యుత్ నిబంధనలు2021 పేరుతో ప్రకటించారు.
పెరిగే ఖర్చుల్ని మదించటానికి వీలుగా ఒక ఫార్ములాను సైతం సిద్ధం చేసిన కేంద్రం.. కావాలంటే రాష్ట్రాలు తమ సొంత ఫార్ములాను కూడా తయారు చేసుకోవచ్చన్న వెసులుబాటు కూడా ఇవ్వటం చూస్తే.. విద్యుత్ వినియోగదారుల నెత్తి మీద మరో భారం మోపినట్లేనని చెబుతున్నారు. మరి.. కేంద్రం నుంచి వచ్చినట్లుగా చెబుతున్న ఆదేశాల మీద రెండు తెలుగు రాష్ట్రాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అయితే.. ఈ వ్యవహారంలో మరో కీలక అంశం కూడా ఉందంటున్నారు.