Begin typing your search above and press return to search.
హేమమాలిని బుగ్గల్ని రోడ్ల తో పోల్చేసిన మరో నేత
By: Tupaki Desk | 13 Nov 2019 7:08 AM GMTఅదేం దరిద్రమో కానీ.. రోడ్ల మీద ఏదైనా వ్యాఖ్యలు చేయాలంటే చాలు బాలీవుడ్ డ్రీం గర్ల్ హేమ మాలిని బుగ్గల్ని ఎగ్జాంపుల్ గా చెప్పే ధోరణి నేతల్లో కనిపించేదే. ఇప్పటి కే పలుమార్లు పలువురు నేతలు హేమ మాలిని బుగ్గల్ని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు ఎన్ని వివాదాలకు కారణమయ్యాయో తెలిసిందే. తాజాగా ఛత్తీస్ గఢ్ కు చెందిన కాంగ్రెస్ మంత్రి కవాసీ లఖ్మా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం గా మారాయి.
తాజాగా ఆయన మాట్లాడుతూ.. హేమమాలిని బుగ్గల్ని ప్రస్తావించి వివాదం లో హైలెట్ అయ్యారు. తాను నక్సల్స్ ప్రభావితం ప్రాంతం నుంచి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యానని.. కానీ తన ప్రాంతం లోని రోడ్లు ప్రముఖ నటి.. బీజేపీ ఎంపీ హేమ మాలిని చెంపల మాదిరి నిర్మించినట్లు వ్యాఖ్యానించారు.
దీని పై బీజేపీ నేతలు తీవ్రం గా మండి పడుతున్నారు. సదరు మంత్రి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కవాసీ నోటికి కాస్త తీట ఎక్కువేనని.. ఆయన తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారని చెబుతారు. గతంలోనూ ఆయన నోరు జారిన సంగతిని గుర్తు చేస్తుంటారు.
విద్యార్థుల తో నిర్వహించిన ఒక కార్యక్రమం లో పాల్గొన్న ఆయన.. విద్యార్థులు అడిగిన ప్రశ్న కు బదులిస్తూ..తనలా రాజకీయ నేత గా కావాలనుకుంటే జిల్లా కలెక్టర్లు.. ఎస్పీ ల కాలర్లు పట్టు కోవాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయినా.. తాను చేసిన పని గురించి గొప్పగా చెప్పుకోవాలంటే.. హేమ మాలిని బుగ్గల్నే ఉదాహరణగా చెప్పాలా? అన్నదే ప్రశ్న.