Begin typing your search above and press return to search.
ఉత్తర ప్రదేశ్ లో మరో ఘోరం ? వినలేం చదవలేం కూడా !
By: Tupaki Desk | 5 May 2022 7:21 AM GMTపోలీసు అంటే నాలుగో సింహం అని ఊగిపోవడం కాదు. పోలీసు అంటే రక్షణకు మారు పేరు అని పొంగిపోవడం కాదు పోలీసు అంటే కొన్ని చోట్ల అసభ్య ప్రవర్తన కూడా ! తండ్రి స్థానంలో ఉంటూ కూడా ఆ స్థాయి మరిచి ప్రవర్తించే మృగం కూడా ! కొన్ని సార్లు అన్న మాట తప్పక కలిపి చదువుకోండి. లేదంటే వ్యవస్థలో ఉన్న మంచి వాళ్లు బాధపడతారు. వ్యవస్థను కాపాడుతూ ప్రతిష్ట పెంచే వాళ్లు బాధపడతారు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘోరం గురించి ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్య నాథ్ మాట్లాడరు. ఇప్పుడే ఏమయింది దేశం కోసం ధర్మం కోసం అన్న వాదం.
కాపాడాల్సిన వారికి ఇంగితం లేదు. రక్షించి చేరదీయాల్సిన వారికి బుద్ధి అంత కన్నా లేదు. అన్యాయం ప్రభో అంటే మళ్లీ అదే అన్యాయాన్ని పదే పదే చేసి చూపించి, నిండు జీవితాన్ని దుర్భరావస్థల్లోకి నెట్టడం కన్నా మించిన పాపం మరొకటి ఉంటుందా?
సమాజం ఎటు నుంచి ఎటు వెళ్తుంది అన్నది కాదు అస్సలు ఎటు వెళ్లాలో తెలిసినా కూడా తెలియని భావ దారిద్ర్యంతో కొట్టు మిట్టాడుతోంది. వ్యవస్థల్లో ఉన్న లోపాలను సవరించాల్సిన ఖాకీలే విచక్షణ కోల్పోయి ఉంటే, ఎవరి నుంచి ఎవరికి భద్రత కావాలి..? ఎవరి నుంచి ఎవరికి రక్షణ కావాలి అన్నదే ఓ పెద్ద సంశయం.
కొన్ని వినేందుకు కానీ రాసేందుకు కానీ అస్సలు అర్హత పొంది ఉండకూడదు. ఎందుకంటే అంతకుమించిన అమానవీయ ఘటన ఇంకొకటి ఉండకూడదు కూడా ! దేశంలో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని డప్పు కొట్టే నాయకులకు ఇవన్నీ వినిపించవు. ప్రజల గోడు వారికి పట్టదు.
కనీస స్థాయిలో కూడా వారు సమస్యలను పట్టించుకోరు. ఆ విధంగా దేశం కోసం ధర్మం కోసం పనిచేసే నాయకులు మహిళల భద్రతకు ఇచ్చే ప్రాధాన్యం గురించి వింటేనే భయపడిపోవాలి. హడలి పోవాలి. ఆవిధంగా ఉత్తరప్రదేశ్ లో ఓ ఘటన అత్యంత జుగుప్సాకరంగా ఉంది.
13 ఏళ్ల బాలిక తనకు అన్యాయం జరిగిందని, తనపై అత్యాచారం జరిగిందని స్టేషనుకు వెళ్తే అక్కడ స్టేషన్ ఇంఛార్జి అత్యంత పాశవికంగా, అమానవీయ ధోరణిలో ఆమె ను బలాత్కారం చేశాడు. వేరే గదికి తీసుకునివెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటనలో బాలిక అత్త ఉంది. ఆమె మాత్రం బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదు. ఇవన్నీ గత నెలలో జరిగిన పరిణామాలు. చాలా ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి సంబంధిత నిందితుడు, సహ నిందితులు కూడా పరారీలోనే ఉన్నారు.
ఉత్తర ప్రదేశ్ లలిత్ పూర్ లోజరిగిన ఈ ఘటన గురించి రాయడం కాదు మాట్లాడడం కాదు అస్సలు ఏం చెప్పాలో కూడా తెలియని సందిగ్ధావస్థలో ప్రజా క్షేమం, మహిళా భద్రత కోరుకునే కార్యకర్తల స్థితి ఉంది. ముందు ఆ బాలికను తీసుకువెళ్లి భోపాల్లో అత్యాచారం చేసి లలిత్ పూర్ కు తీసుకువచ్చి, పోలీస్ స్టేషన్ కు సమీపంలో వదిలి వెళ్లారు నిందితులు.ఇదే బాధను తనఅత్తకు చెప్పి ఆమెతో కలిసి పోలీసు స్టేషన్ కు వెళ్తే ఆ చిన్నారికి దక్కిన ప్రతిఫలం ఇది.