Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: హోంక్వారంటైన్ లో మంత్రి ఎర్రబెల్లి

By:  Tupaki Desk   |   26 July 2020 11:40 AM IST
బ్రేకింగ్: హోంక్వారంటైన్ లో మంత్రి ఎర్రబెల్లి
X
కరోనా మహమ్మారి కమ్మేస్తోంది. అందిరికీ వ్యాపిస్తోంది. పరిస్థితి చూస్తుంటే సామూహిక వ్యాప్తిలోకి వచ్చినట్టేనని వైద్య నిపుణులు అనుమానిస్తున్నారు. ఎవరి నుంచి ఎవరికి సోకుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. ఇటీవల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పీఏతోపాటు ఇద్దరు గన్ మెన్లు, ఒక కానిస్టేబుల్, డ్రైవర్, మరో సహాయకుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలోనే మంత్రి ఎర్రబెల్లి వారితో చాలా సమావేశాల్లో కలిసి పాల్గొనడంతో హోం క్వారంటైన్ లోకి వెళ్లినట్లు తెలిసింది.

ఈనెల 21న వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలకేంద్రంలోని మంత్రి స్వగృహంలో మంత్రి వెంట ఉండే దాదాపు 40 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టుల్లో ఆరుగురికి పాజిటివ్ అని తేలింది. వీరిని హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఈ క్రమంలోనే వారితో సాన్నిహితంగా ఉన్న మంత్రి ఎర్రబెల్లి కూడా హోం క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించుకున్నారు.