Begin typing your search above and press return to search.

పెళ్లి కుమార్తె ను కిడ్నాప్ చేసి.. మతం మార్చి పెళ్లి చేసుకున్న పాకిస్తానీ

By:  Tupaki Desk   |   27 Jan 2020 6:36 AM GMT
పెళ్లి కుమార్తె ను కిడ్నాప్ చేసి.. మతం మార్చి పెళ్లి చేసుకున్న పాకిస్తానీ
X
పొరుగున ఉన్న పాకిస్థాన్ లో మైనార్టీలు గా ఉన్న హిందువులకు ఏ మాత్రం భద్రత లేదన్న వార్తలు తరచూ వస్తుంటాయి. తమ దేశంలో మైనార్టీలకు రక్షణ కల్పించే విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నట్లు ఇమ్రాన్ ప్రభుత్వం చెబుతున్నా.. వాస్తవాలు మాత్రం వేరుగా ఉన్నాయని చెబుతున్నారు. తాజాగా పెళ్లి మండపం లోని పెళ్లి కుమార్తె ను కిడ్నాప్ చేసి ఆమెను బలవంతం గా మతం మార్చి.. ముస్లిం యువకుడు పెళ్లాడిన వైనం సంచలనం గా మారింది.

కరాచీ నగరానికి 245 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింధ్ రాష్ట్రంలోని మాటియారి జిల్లా హాలా పట్టణం లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఈ పట్టణానికి చెందిన 24 ఏళ్ల భారతికి మరో హిందూ యువకుడితో పెళ్లి జరుగుతోంది. ఇలాంటి వేళ.. షారుఖ్ గుల్ అనే యువకుడు వచ్చి పోలీసులు.. కొంతమంది వ్యక్తులతో కలిసి పెళ్లి కుమార్తెను బలవంతంగా తీసుకెళ్లాడు. ఆమెకు మతం మార్చి పెళ్లాడాడు. దీనిపై భారతి తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటం తో పాటు.. తన కుమార్తె కు బలవంతం గా మత మార్పిడి చేసి పెళ్లాడినట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. బలవంతం గా పెళ్లాడిన యువకుడి వెర్షన్ వేరుగా ఉంది. తాను తీసుకొచ్చిన భారతి గతంలోనే ఇస్లాం మతంలోకి మారిందని.. ఆమెను తాను పెళ్లాడినట్లుగా చెబుతున్నాడు. తన భార్యకు వేరే వారితో పెళ్లి చేస్తున్నారని.. అందుకే తాను తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు. భారతి పేరును బుష్రాగా మార్చారు. ఆమె గతంలోనే మతం మారిందని షారుక్ వాదిస్తున్నాడు. పెళ్లి పందిట్లో నుంచి హిందు మహిళను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన వైనం అక్కడ సంచలనం గా మారింది. ఈ ఉదంతం పాక్ లో మైనార్టీలకున్న భద్రత ఇట్టే అర్థం చేసుకోవచ్చని వధువు తండ్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.