Begin typing your search above and press return to search.
టీడీపీకి షాక్ ఇచ్చిన మరో ఎమ్మెల్యే తమ్ముడు ..ఏంజరిగిందంటే !
By: Tupaki Desk | 24 Feb 2020 6:45 AM GMTతెలుగుదేశం పార్టీ ..ఒకప్పుడు ఈ పార్టీ ఏపీని ఏకచక్రాధిపత్యంగా ఏలింది. కానీ , ప్రస్తుతం పార్టీ మరుగున పడే స్థితికి వచ్చేసింది. దీనికి ఒక రకంగా కారణం తెలుగు తమ్ముళ్లే . పాపం ఈ మధ్య తమ్ముళ్ళకి అంతగా కలిసిరావడంలేదు. ఒకదాంట్లో నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం అని, అనుకునేలోపే పార్టీకి ఇంకో కొత్త సమస్యని తెచ్చిపెడుతున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రాలో టీడీపీ అంతంతమాత్రంగానే ఉంది. ఈ స్టేజ్ నుండి పార్టీని ఎలా బయట పడేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో టీడీపీలో ఇపుడు బిగ్ షాట్, మాజీ మంత్రి , సిక్కోలు నేత అచ్చెన్నాయుడు ఈఎస్ ఐ కుంభకోణం లో అడ్డంగా దొరికిపోయారు.
ఈ వ్యవహారం పై ఇప్పుడు టీడీపీలో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ వివాదం ఇంకా ఆలా జరుగుతున్న సమయంలోనే మరో ఎమ్మెల్యే తమ్ముడి నిర్వాకం పార్టీ శిబిరంలో కలవరం రేపుతున్నాయి. విశాఖ అర్బన్ టీడీపీ ప్రెసిడెంట్, సౌత్ ఎమ్మెల్యే అయిన వాసుపల్లి గణేష్ కుమార్ కి చెందిన వైజాగ్ డిఫెన్స్ అకాడమీ , మరో వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. వైజాగ్ డిఫెన్స్ అకాడమీలో ప్లే గ్రౌండ్, హార్స్‌రైడింగ్, సరైన భోజన వసతులు లేవని నిర్వాహకుల్ని విద్యార్థులు అడిగినందుకు గాను , 100 మంది విద్యార్థులను నిర్వాహకులు సెల్లార్ లో బంధించారు. దీనితో లక్షల్లో ఫీజులు దండుకుంటూ , కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయకుండా ,దానిపై వివరణ అడిగిన విద్యార్థులని సెల్లార్ లో బంధిచడం తో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనపై విచారణ చేపట్టారు.
ఈ విదంగా విద్యార్థులను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని డిఫెన్స్ అకాడమీ పై పలు ఆరోపణలు రావడంతో ఇపుడు టీడీపీ లో మరో ఎమ్మెల్యే తమ్ముడు ఇరకాటంలో పదారు. ఈ వ్యవహారం పై పార్టీ అధినేత , మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాత్రం ఇది బీసీల మీద దాడిగా చిత్రీకరిస్తున్నారు. కళ్ళ ముందు పెద్ద ఎత్తున విద్యార్ధులు మీడియాతో లైఫ్ లో మాట్లాడుతూ మాకు నిర్వాహకులు సదుపాయాలు లేకుండా చేశారని, హింస పెడుతున్నారని చెబుతున్నా కూడా ఇది వైసీపీ సర్కార్ కుట్ర అని అనడం ఆ మాజీ మంత్రిగారికే చెల్లుతుంది అంటూ వైసీపీ వర్గాలు కూడా మంత్రిగారికి కొంచెం గట్టిగానే సమాధానం ఇచ్చాయి. మొత్తంగా ఇప్పటికే ఉత్తరాంధ్రా లో టీడీపీ ఉనికి పెద్దగా కనిపించడం లేదు, ఈ నేపథ్యం లో వరుసగా ఉత్తరాంధ్రా తమ్ముళ్లకి కోలుకోలేని షాకులు తగులుతుంటే పార్టీలో ఆందోళనల మొదలైంది.