Begin typing your search above and press return to search.
ట్రంప్ మీద పోటీ కి మరో మల్టీ మిలియనీర్ బరి లోకి దిగుతున్నాడు
By: Tupaki Desk | 14 Nov 2019 5:05 AM GMTవచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. అమెరికా అధ్యక్షుడి గా ఉన్న రిపబ్లిక్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ మరో సారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం కావటమే కాదు.. అందుకు తగ్గట్లు పావులు కదుపుతున్నారు. ట్రంప్ సీన్లో ఉన్న నేపథ్యం లో ఆయన మీద సొంత పార్టీ లో గుర్రుగా ఉన్నప్పటికీ.. ఎదురుచెప్పే అవకాశం లేదంటున్నారు.
ఇదిలా ఉంటే.. ట్రంప్ కు చెక్ పెట్టేందుకు విపక్ష డెమొక్రాటిక్ పార్టీ నుంచి పలువురునేతలు అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి గా బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలువురు అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. డెమొక్రటిక్ అభ్యర్థి గా బరిలోకి దిగాలని తప్పిస్తున్న నేతల్లో బిడెన్ ముందంజ లో ఉన్నారు.
ఆయన కాకుండా బెర్నీ శాండర్స్.. ఎలిజబెత్ వారన్ లు ఉన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా బిడెన్ కు పోటీగా మరో నేత రంగంలోకి వచ్చారు. న్యూయార్క్ నగర మాజీ మేయర్.. అత్యంత సంపన్నుడైన మైకేల్ బ్లూమ్ బర్గ్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని తపిస్తున్నారు. త్వరలో తాను అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు సీన్లోకి వస్తున్నట్లుగా అధికారిక ప్రకటనను త్వరలోనే చేయున్నట్లు చెబుతున్నారు.
ఎన్నికల బరిలోకి బ్లూమ్ బర్గ్ రావటం పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను మీడియా అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో ఆయన బదులిచ్చారు. బ్లామ్ బర్గ్ ఎంట్రీ కారణంగా తనకు జరిగే నష్టమేమీ ఉండదని.. అదంతా డెమొక్రటిక్ పార్టీ నేతల ఇబ్బంది గా అభి వర్ణించారు. ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవాలనుకునే వారి అవకాశాల్ని దెబ్బ తీస్తుందన్న మాటను చెప్పారు. మరి.. బ్లూమ్ బర్గ్ అభ్యర్థిత్వాన్ని డెమొక్రటిక్ పార్టీ ఆమోదిస్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.