Begin typing your search above and press return to search.
మృత్యుగంట.. వైరస్ జన్యుక్రమంలో మార్పులు !
By: Tupaki Desk | 4 July 2020 12:45 PM ISTప్రపంచ దేశాలు ఈ వైరస్ మహమ్మారిని ఎలా కట్టడిచేయాలని ఆలోచిస్తుంటే చెందుతుంటే ఇప్పుడు తాజాగా మరో ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. వైరస్ కారక ‘సార్స్ కోవ్ 2’ వైరస్ జన్యు క్రమంలో మార్పు జరిగిందని, దీంతో డీ614జీ అనే కొత్త రకం వచ్చిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. వైరస్ జన్యుక్రమంలో మార్పుల కారణంగా మనుషుల్లో ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం మరింత పెరిగినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఈ రకమైన వైరస్ ఏప్రిల్ మొదటివారంలోనే తమ దృష్టికి వచ్చిందన్నారు. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ వైరస్ ప్రవేశిస్తే పరిస్థితులు తారుమారవుతాయని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన బెటే కోర్బర్ పేర్కొన్నారు. వైరస్ స్వల్ప మార్పులు చెందినప్పటికీ అది చాలా సమర్ధవంతమైనదని, వైరస్ శరీరం పై కొమ్ముల్లాంటి నిర్మాణాలు ఏర్పడ్డాయని ఇది మానవ శరీరంలోనికి దూసుకుపోవటానికి ఉపయోగపడుతుందని అన్నారు.
వైరస్ పై పొరల్లో ఉండే కొమ్ములాంటి ‘స్పైక్ ప్రొటీన్’లో ఈ మార్పు జరిగిందని వివరించారు. శ్వాసకోశ వ్యవస్థ పైభాగంలో ఈ వైరస్ భారీ స్థాయిలో ఉంటుందని.. దీని వల్ల ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ వైరస్‌కి సంబంధించి మరింత లోతైన పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.