Begin typing your search above and press return to search.
మరో కొత్త వేరియంట్ కలకలం.. పొంచి ఉన్న పెనుప్రమాదం!
By: Tupaki Desk | 1 Sep 2021 11:30 AM GMTకరోనా వైరస్ మహమ్మారితో ఇప్పటికే ప్రపంచ దేశాలు తీవ్రంగా నష్టపోతుండగా, వెలుగులోకి వస్తున్న కొత్త వేరియంట్లు మరింత కలవరం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే అనేక రకాల వేరియంట్లు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని బలితీసుకుంటున్నాయి. తాజాగా, మరో కరోనా వైరస్ వేరియంట్ వెలుగులోకి వచ్చింది. కరోనా వేరియంట్ సీ.1.2గా పిలుస్తోన్న ఈ వేరియంట్ తొలిసారిగా దక్షిణాఫ్రికాలో బయటపడింది. ప్రస్తుతానికి ఆందోళనకర వైరస్‌గా దీన్ని ప్రకటించనప్పటికీ.. వ్యాక్సిన్ నుంచి కలిగే రక్షణ నుంచి తప్పించుకునే సామర్థ్యం ఈ వేరియంట్‌కు ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
కరోనా కొత్త వేరియంట్ సీ.1.2ను ఈ ఏడాది మే నెలలోనే తొలిసారి గుర్తించినట్లు దక్షిణాఫ్రికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్(ఎన్ ఐ సీడీ), క్వాజులు-నాటల రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ సీక్వెన్సింగ్ ప్లాట్ ఫాం(కేఆర్ ఐ ఎస్పీ)లు సంయుక్తంగా వెల్లడించాయి. కాగా, ఆగస్టు 13 నాటికి చైనా, కాంగో, మారిషస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్ దేశాల్లోనూ ఈ వేరియంట్ విస్తరించినట్లు ఈ సంస్థలు తెలిపాయి. దక్షిణాఫ్రికాలో ఫస్ట్ వేవ్ విజృంభణ సమయంలో ఎక్కువ ప్రభావం చూపిన సీ.1 వేరియంట్, ఇప్పుడు మరిన్ని మ్యూటేషన్లు చెందిన సీ.1.2గా మారినట్లు వైద్య నిపుణులు పేర్కొన్నారు.
అత్యధిక మ్యూటేషన్లకు గురైన వేరియంట్ ఈ సీ.1.2 అత్యధిక వ్యాప్తి చెందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దక్షిణాఫ్రికాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ వేరియంట్ వ్యాప్తి, ప్రాబల్యాన్ని ఖచ్చితంగా అంచనా వేయలేకపోయారు. బీటా, డెల్టా వేరియంట్ల మాదిరిగానే ఈ వేరియంట్ మ్యూటేషన్లో పెరుగుదల కనిపిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. సీ.1.2 వైరస్ మ్యూటేషన్ రేటు ఏడాదికి 41.8 గా ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఇది ఇతర రకాల మ్యూటన్ల రేటుతో పోలిస్తే దాదాపు రెట్టింపు వేగంతో మార్పులు చెందుతున్నట్లు గుర్తించారు. వేగంగా మార్పు చెందడం వల్ల దానికి విరుగుడు కనుక్కోవడం కూడా కష్టసాధ్యంగా మారే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కాగా, ఎన్440కే, వై449హెచ్ వంటి మ్యూటేషన్లు వ్యాక్సిన్ల వల్ల పొందే యాంటీబాడీల నుంచి తప్పించుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు.
ఇకపోతే, ఇప్పుడు ఎంయు అనే మరో కొత్త వేరియంట్ ప్రపంచాన్ని భయపెడుతున్నది. ఈ ఎంయు వేరియంట్ ను సాంకేతికంగా బి.1.621 వేరియంట్‌గా పిలుస్తారు. దీనిని మొదటగా కొలంబియా దేశంలో గుర్తించారు. ఈ వేరియంట్‌లో వేగంగా మ్యూటేషన్లు జరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొన్నది. ఈ క్రమంలో తాజా వేరియంట్ల కోసం మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అసవరం ఉందని చెబుతున్నారు. వ్యాక్సిన్ అభివృద్ధిల్లోనూ వీటిని పరిగణలోకి తీసుకుని ప్రయోగాలు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ప్రపంచాన్ని అనేక కరోనా వేరియంట్లు భయాందోళనలకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. దేశంలో అయితే డెల్టా వేరియంట్ సెకండ్ వేవ్ లో మిగిల్చన విషాదం అంతా ఇంతా కాదు. లక్షలాది మంది కరోనా బారినపడగా, వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.