Begin typing your search above and press return to search.
నకిలీ కొటేషన్లతో అధిక ధరలకు ఆర్డర్లు ..ఏపీ ఈఎస్ఐ స్కాంలో మరో అరెస్ట్ !
By: Tupaki Desk | 4 July 2020 9:15 AM GMTఏపీ ఈఎస్ ఐ స్కాం దర్యాప్తు లో ఏసీబీ చాలా దూకుడు గా వ్యవహరిస్తుంది. ఈ కేసులో తాజాగా మరొకరిని అరెస్ట్ చేసింది. దీనితో ఏపీ ESI స్కామ్ లో మొత్తం అరెస్టుల సంఖ్య పదికి చేరింది. విజయవాడ భవానీపురం లో తిరుమల మెడికల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న కార్తీక్ అనే వ్యక్తిని ఏసీబీ అధికారులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. కార్తీక్ కు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం అతడ్ని విజయవాడ సబ్ జైలు కు తరలించారు. నకిలీ కొటేషన్ల తో అధిక ధరలకు ఆర్డర్లు పొందినట్టు ఏసీబీ తేల్చింది. ఈ కారణం తోనే కార్తీక్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
ఆంధ్ర ఏపీ డైరెక్టర్ ఆఫ్ ఇన్స్యూరెన్స్ అండ్ మెడికల్ ఇన్స్యూరెన్స్ లో 2014-15 నుంచి 2018-19 వరకు జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాలు మేరకు విజిలెన్స్ ఎన్ ఫోర్స్‌మెంట్ దర్యాప్తు చేసింది. పలు అవినీతి అక్రమాలు జరిగినట్లు నిర్దారించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రభుత్వ ఆదేశాలు మేరకు ఏసీబీ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగా 988.77 కోట్లా విలువైన మందులు, వైద్య పరికరాల కొనుగోలులో 150 కోట్ల పైన అవినీతి అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా నిర్దారించారు.
ఇప్పటివరకు ప్రభుత్వ అధికారులు మరియు ప్రైవేటు వ్యక్తులు కలిపి 19 మంది ప్రమేయం గుర్తించారు. అప్పటి కార్మికశాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు ఆదేశాలతో M/s Tele Health Services Pvt., Ltd అనే సంస్థకు కాల్ సెంటర్, టోల్ ఫ్రీ మరియు ECG సంబంధించి కాంట్రాక్ట్ చేసుకున్నారు.. దీనిపై మంత్రి ఓ లేఖ కూడా రాశారు. తర్వాత అప్పటి IMS డైరెక్టర్ అయిన డాక్టర్ సీకే రమేష్ కుమార్ ఈ ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందంలో అక్రమాలు జరిగాయని తేలింది. ఈఎస్ ఐ కుంభకోణంలో మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడితో పాటూ మరో తొమ్మిది మంది ఇప్పటికే అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.