Begin typing your search above and press return to search.
తెలంగాణలో ఇంకో రాజకీయ పార్టీ... ఆ ఉద్యమ నేతదే నాయకత్వం
By: Tupaki Desk | 1 May 2022 12:30 AM GMTతెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అధికార టీఆర్ఎస్ పార్టీ రథసారథి కేసీఆర్ ముచ్చటగా మూడో సారి గులాబీ పార్టీని గద్దె నెక్కించేదుకు వ్యూహాలు పన్నుతుంటే... ప్రధాన ప్రతిపక్షాలు సైతం తమదైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల వైఎస్సార్‌టీపీ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేసి దూకుడుతో వెళుతున్నారు. మాజీ ఐపీఎస్ ఆర్ఎస్.
ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీలో చేరారు. ఈ ఇద్దరు నేతలు కేసీఆర్ ప్రభుత్వమే టార్గెట్ గా పాదయాత్ర పేరుతో నేరుగా ప్రజల్లోకి వెళుతున్నారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇలాంటి తరుణంలోనే మరో రాజకీయ పార్టీ తెలంగాణలో తెరమీదకు వచ్చే చాన్స్ కనిపిస్తోంది. అదే బీసీ ఉద్యమకారుడు ఆర్.కృష్ణయ్య సారథ్యంలో ఏర్పడనున్న రాజకీయ వేదిక.
బీసీలను అన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయని ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. బీసీల కోసం కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు వస్తున్నాయని గుర్తు చేశారు. రాజ్యాధికారం వస్తేనే బీసీలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఆర్.
కృష్ణయ్య వ్యాఖ్యానించారు. బీసీల కోసం మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్.కృష్ణయ్య సంచలన ప్రకటన చేశారు. త్వరలో అన్ని కుల సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తానని, ఏకాభిప్రాయం వస్తే పార్టీపై ప్రకటన చేస్తానని తెలిపారు.
తెలంగాణలో ఇప్పటికే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల వైఎస్సార్‌టీపీ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేసి దూకుడుతో వెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని షర్మిల ఇప్పటికే ప్రకటించారు. ఇక ఆర్. ప్రవీణ్ కుమార్ బీఎస్సీ పార్టీలో చేరి టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.
కాగా, ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే ఉన్న నేపథ్యంలో నేతలందరూ వ్యూహలు రచిస్తున్నారు. పాదయాత్ర పేరుతో నేరుగా ప్రజల్లోకి వెళుతూ కేసీఆర్ ప్రభుత్వమే టార్గెట్ గా ముందుకు సాగుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేత, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, వైఎస్ఆర్‌టీపీ రథసారథి వైఎస్ షర్మిల, బీఎస్పీ ముఖ్య నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పటికే పాదయాత్రల్లో బిజీగా ఉన్నారు. ఈ తరుణంలో ఆర్.కృష్ణయ్య మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.