Begin typing your search above and press return to search.

బాబు ఢిల్లీ టూర్ వెన‌క మ‌రో కార‌ణం!

By:  Tupaki Desk   |   21 Oct 2021 10:30 AM GMT
బాబు ఢిల్లీ టూర్ వెన‌క మ‌రో కార‌ణం!
X
టీడీపీ పార్టీ కార్యాల‌యాల‌పై వైసీపీ దాడులు చేయ‌డంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను క‌లిసేందుకు ఢిల్లీ వెళ్తాన‌ని మాజీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు వెల్ల‌డించారు. కానీ ఇప్పుడు ఈ టీడీపీ అధినేత దేశ రాజ‌ధాని ప‌ర్య‌ట‌న వెన‌క మ‌రో ప్ర‌ధాన కార‌ణం కూడా ఉన్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. అదేమిటంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవ‌డం. ఏపీలో బాబు ఒంట‌రిగా ఎన్నిక‌ల‌కు వెళ్తే జ‌గ‌న్‌ ధాటిని త‌ట్టుకుని నిల‌బ‌డడం క‌ష్టం. ఆ విష‌యం బాబుకు కూడా తెలుసు. అందుకే ఆయ‌న ఇప్ప‌టి నుంచే పొత్తుల కోసం ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో టీడీపీ ప‌రిస్థితి దారుణంగా మారింది. 2019 ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత రోజురోజుకూ ఆ పార్టీ ప‌రిస్థితి మ‌రింత‌గా దిగ‌జారుతోంది. స్థానిక ఎన్నిక‌ల్లోనూ ఈ విష‌యం మ‌రోసారి స్ప‌ష్ట‌మైంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఇదే ప‌రిస్థితి ఉంటే టీడీపీకి గ‌డ్డు కాలం త‌ప్ప‌దు. సోలోగా అధికారాన్ని ద‌క్కించుకునే సామ‌ర్థ్యం ఇప్పుడు బాబుకు లేదు. 2014 ఎన్నిక‌ల్లోనూ జ‌న‌సేన బీజేపీ కూట‌మితోనే ఆయ‌న ఏపీలో అధికారంలోకి రాగ‌లిగారు. అందుకే మ‌రోసారి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా క‌లిసి వ‌స్తార‌నే ఆలోచ‌న‌లతో బాబు ఉన్నారు.

ఈ ప‌రిస్థితుల్లో బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఆస‌క్తిక‌రంగా మారింది. 36 గంట‌ల దీక్ష చేసి మ‌రీ ఆయ‌న హ‌స్తిన‌కు వెళ్ల‌నున్నారు. ఈ దీక్ష‌తో పాజిటివ్ ఫ‌లితాలు రాబ‌ట్టాల‌నేది బాబు ఆలోచ‌న‌గా చెబుతున్నారు. ఇలా అయినా సానుభూతితో కేంద్రం పెద్ద‌ల అపాయింట్‌మెంట్ దొరుకుతుంద‌ని ఆశిస్తున్నారు. మ‌రోవైపు ఏపీలో అధికారంలో ఉన్న జ‌గ‌న్‌.. బీజేపీకి దూరంగా ఉండాల‌ని అనుకుంటున్నారు. పోల‌వరం నిధుల విడుద‌ల ప్ర‌త్యేక హోదా త‌దిత‌ర అంశాల్లో కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు నుంచి జ‌గ‌న్‌కు మొండిచెయ్యే ఎదుర‌వుతోంది. ఈ నేప‌థ్యంలో బీజేపీకి కూడా ఏపీలో టీడీపీతో పొత్తు అవ‌స‌ర‌మ‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

కానీ బీజేపీతో బాబు పొత్తు ప్ర‌యత్నాలు అంత సులువుగా సాగేలా క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే ఏపీలోని బీజేపీ నాయ‌కులు టీడీపీతో పొత్తుకు సుముఖంగా లేర‌నే టాక్ ఉంది. టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్ర‌స‌క్తే లేద‌ని వాళ్లు అంటున్నారు. రాష్ట్రంలో టీడీపీకి ప్ర‌త్యామ్నాయంగా ఎదుగుతామ‌నే విశ్వాసాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి బీజేపీతో పొత్తు పెట్టుకోవాల‌నే బాబు ప్ర‌య‌త్నాలు ఏ మేరకు ఫ‌లిస్తాయో చూడాలి.