Begin typing your search above and press return to search.
విడాకుల బాటలో ప్రపంచ కుబేరులు.. తాజాగా మరో జంట
By: Tupaki Desk | 21 Jun 2022 4:12 AM GMTప్రపంచంలోని వందల కోట్ల ప్రజలకు సాధ్యం కాని పనిని సాధించిన వారిగా ప్రపంచ కుబేరుల్ని చెప్పొచ్చు. ధనం మూలం ఇదం జగత్ అని నమ్మే కోట్లాది మందికి.. ప్రపంచాన్ని నడిపించే ధనాన్ని తమ దాసులుగా చేసుకున్న కుబేరులకు కష్టాలు ఉంటాయా? అంటే నమ్మలేం కానీ.. ఇది నిజం. వారు లక్షలాది కోట్ల ధనాన్ని ఆర్జించినా.. వారు మాత్రం కట్టుకున్న భార్యను మాత్రం మెప్పించలేకపోతున్నారు. దీంతో విడాకుల బాట పడుతున్నారు. గడిచిన మూడేళ్లలో చూస్తే.. ప్రపంచ కుబేరులుగా నిలిచిన టాప్ కుబేరుల జంటల్లో మూడో జంట తాజాగా విడాకులకు సిద్ధమైంది.
వివాహ బంధం నుంచి వేరు పడేందుకు తాజాగా వెలుగు చూస్తున్న జంటగా దిగ్గజ సెర్చింజన్ గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్ ఆయన సతీమణి నికోల్ షనాహన్ లుగా చెప్పాలి. నాలుగేళ్ల క్రితమే 49 ఏళ్ల సెర్జీ బ్రిన్.. 37 ఏళ్ల నికోల్ షనాహన్ లు ఒక్కటయ్యారు. వీరికి మూడేళ్ల కుమార్తె కూడా ఉన్నారు. అయితే.. విరుద్దమైన అభిప్రాయాలు ఉన్న వీరు.. కలిసి ఉండే కంటే విడిపోయేందుకు వీలుగా విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా కోర్టును ఆశ్రయించారు.
ఈ హైప్రొఫైల్ విడాకుల కేసు మీద ప్రజల్లో ఉండే ఆసక్తి ఎంతన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే.. తమ చిన్నారి వివరాలు బయటకు రాకుండా ఉండేందుకు.. తమ వ్యక్తిగత విషయాలు బయటకు వెల్లడి కావటం ఇష్టం లేని ఈ జంట.. తమ విడాకుల కేసును వ్యక్తిగతంగా పరిష్కరించుకోవటానికి వీలుగా ప్రైవేటు జడ్జి ఆధ్వర్యంలో విచారణ జరగాలని కోరుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇక.. ఈ జంట వ్యక్తిగత వివరాల్లోకి వెళితే.. సెర్జీ బ్రిన్ ఇంతకు ముందే మరో మహిళతో విడిపోయారు. 2007లో అన్నే వొజిస్కీని పెళ్లాడిన అతగాడు 2015లో ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు.
అనంతరం షనాహన్ తో మూడేళ్లు సహజీవనం చేసి పెళ్లాడారు. కానీ.. నాలుగేళ్లకే విడిపోనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ జంట ఏడాదిగా ఎవరికి వారుగా విడిగా ఉంటున్నట్లు చెబుతున్నారు.బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ నివేదిక ప్రకారం సెర్జీ బ్రిన్ సంపద దాదాపు రూ.7లక్షల కోట్లకు పైనే ఉంటుందంటున్నారు.
అపర కుబేరులు విడాకులు తీసుకున్న జాబితాలో బిల్ గేట్స్ ఇప్పటికే చోటు సాధించి.. ప్రపంచ వ్యాప్తంగా వీరి విడాకుల కేసు పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. బిల్ గేట్స్ దంపతులకు ముందే అమెజాన్ అధినేత జెఫ్ బోజోస్ జంట కూడా విడాకులు తీసుకోవటం తెలిసిందే. మిగిలిన విడాకుల వ్యవహారంతో పోలిస్తే అమెజాన్ అధినేత విడాకుల వ్యవహారం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ విడాకుల కారణంగా తన మాజీ సతీమణికి భారీగా భరణాన్ని ఇవ్వాల్సి రావటం తెలిసిందే. తాజాగా సెర్జీ బ్రిన్ జంట విడాకుల బాటలో నడవటం.. తన సతీమణికి ఎంత భరణం ఇవ్వనున్నారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.