Begin typing your search above and press return to search.
అమెరికాలో మరో రోడ్డు ప్రమాదం.. కొండమీద నుంచి కారుతో కిందపడ్డ భారతీయ వైద్యుడి కుటుంబం
By: Tupaki Desk | 5 Jan 2023 4:51 AM GMTభారతీయ సంతతికి చెందిన ఒక వైద్యుడు అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తన భార్య , ఇద్దరు పిల్లలతో కలిసి తన టెస్లా కారులో కొండపైనుంచి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారందరినీ రక్షించి ఆసుపత్రికి తరలించారు.
అమెరికాలోని కాలిఫోర్నియాలో పసాదేనాకు చెందిన భారతీయ వైద్యుడు ధర్మేష్ ఎ పటేల్ ఉద్దేశపూర్వకంగా ఇలా చేసాడని సమాచారం. ధర్మేష్ తన భార్య పిల్లలతో కలిసి కొండపైనుంచి కారుతో కిందకు పోనిచ్చాడు. ఆత్మహత్యాయత్నం చేసినట్టు సమాచారం. ధర్మేష్ ఆసుపత్రి నుండి విడుదలైన తర్వాత అరెస్ట్ చేసి శాన్ మాటియో కౌంటీ జైలుకు పంపుతామని పోలీసులు తెలిపారు.
ధర్మేష్ పటేల్ , అతని కుటుంబం సోమవారం శాన్ మాటియో కంట్రీలోని డెవిల్స్ స్లైడ్ అనే కొండపైనుంచి కారుతో లోయలోకి పోనిచ్చారు. ఈ ప్రమాదంలో అతడి పిల్లలు 7 ఏళ్ల బాలిక , 4 ఏళ్ల బాలుడిని రక్షించడానికి అగ్నిమాపక సిబ్బంది కొండపైకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ తో ఈ పిల్లలను, ఈ వైద్య దంపతులను వాహనం నుండి రక్షించి ఆస్పత్రికి తరలించారు.
250 నుంచి 300 అడుగుల లోయలో కిందకు పడిన తర్వాత కూడా ఓ మోస్తరు గాయాలతో వీరంతా ప్రాణాలతో బయటపడిన అరుదైన ఘటనగా దీన్ని అభివర్ణిస్తున్నారు. కారు సీట్లలో ఉన్న పిల్లలు సీట్ బెల్ట్‌ల ద్వారా రక్షించబడ్డారు. టెస్లా కారులోని అత్యాధునిక ఫీచర్లు కూడా వీరు ప్రమాదం బారిన పడకుండా కాపాడయని పోలీసులు చెబుతున్నారు.
మిస్టర్ పటేల్‌పై మూడు హత్యాయత్నాలు ,రెండు పిల్లలపై వేధింపుల ఆరోపణల కేసు నమోదు చేయాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.