Begin typing your search above and press return to search.
అమరావతిలో మరో కుంభకోణం: సజ్జల సంచలనం
By: Tupaki Desk | 26 March 2021 1:30 PM GMTఅమరావతి భూ కుంభకోణంపై హైకోర్టు విచారణ మళ్లీ మొదటి నుంచి మొదలు పెట్టిన వేళ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూముల కుంభకోణమే కాదని.. లంక భూముల కుంభకోణం కూడా మరొకటి ఉందని సజ్జల ఆరోపించారు. నాడు భయపెట్టి.. బెదిరించి లాక్కొన్నారని.. గత ప్రభుత్వం, మాజీ సీఎం చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించారు.
అసైన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబు దళితులకు అన్యాయం చేశారని సజ్జల ఆరోపించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు బినామీలు కారు చౌకగా భూములు కొట్టేశారన్న సజ్జల భూములు దోచుకునేందుకే రాజధాని పేరుతో చంద్రబాబు అతిపెద్ద స్కామ్ కు పాల్పడ్డారని తెలిపారు.అసైన్డ్ భూములపై జీవో 41 జారీ చేస్తే ఇబ్బందులు వస్తాయని అప్పట్లోనే లాసెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, సీఆర్డీఏ కమిషనర్ హెచ్చరించినా చంద్రబాబు పట్టించుకోలేదని సజ్జల ఆరోపించారు.
ప్రలోభపెట్టి, బెదిరించి ప్రభుత్వం కేసులు పెట్టిందని ఇప్పుడు టీడీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు బినామీలకు లబ్ధి చేకూర్చేందుకే జీవో 41 తెచ్చారని సజ్జల విమర్శించారు. ముందుగా తెచ్చిన ల్యాండ్ ఫూలింగ్ స్కీమ్ లో అసైన్డ్ భూముల ప్యాకేజీ గురించి ఎందుకు ప్రస్తావించలేదు.. కొంత కాలం గ్యాప్ తర్వాత జీవో 41ను తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. తానేం తప్పు చేయకుంటే సీఐడీ ముందు వచ్చి వివరణ ఇవ్వడానికి చంద్రబాబుకున్న అభ్యంతరం ఏంటి అని ప్రశ్నించారు.ఇక అసైన్డ్ భూములే కాదు.. లంక భూముల కుంభకోణం మరొకటి ఉంటుందని సజ్జల ఆరోపించారు. నాడు భయపెట్టి.. బెదిరించి భూములను లాక్కొన్నారని ఆరోపించారు.