Begin typing your search above and press return to search.
వాహనదారులకు మరో షాక్ ... పెట్రోల్ , డీజల్ పై వ్యాట్ పెంపు !
By: Tupaki Desk | 30 Jan 2020 5:19 AM GMTఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎవరూ ఉహించనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ పాలన కొనసాగిస్తుంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన ఈ నెలల కాలంలోనే ఎన్నో పథకాలని తీసుకువచ్చి ప్రజలని ఆకట్టుకుంటునే ..మరోవైపు షాక్ లు కూడా ఇస్తోంది. ముందుగా అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధంలో భాగంగా మద్యం ధరని విపరీతంగా పెంచేసి, మందుబాబుల జోబులకి చిల్లు పెట్టిన జగన్ సర్కార్ ..తాజాగా వాహనదారుల జోబులకి చిల్లుపెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇంతకీ వాహనాదులకి జగన్ సర్కార్ ఇచ్చే షాక్ ఏమిటంటే ... పెట్రోల్, డీజిల్ లపై వ్యాట్ పెంచేసింది.
ప్రస్తుతం ఏపీలో పెట్రోల్ పై 31 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నారు. దాన్ని 35.20 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీజిల్ పై 22.25 శాతం వ్యాట్ వసూలు చేస్తుండగా దాన్ని 27 శాతానికి పెంచారు. ఇప్పటికే రోజూ మారుతున్న పెట్రోల్ ధరలు ఈ మధ్య రోజుల్లో ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఏపీ సర్కారు పన్ను పెంపు నిర్ణయంతో మరింత భారంగా పెట్రోల్, డీజిల్ ధరలు మారనున్నాయి. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నపుడు 2018 సెప్టెంబర్ నెలలో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో 2 రూపాయల మేర పన్నులను పెట్రోల్, డీజిల్ పై తగ్గించారు.
ఇప్పుడు దాదాపు 16 నెలల తరువాత అదేమేర పన్నులను పెంచడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. వ్యాట్ పెంపు వలన ప్రభుత్వానికి దాదాపు 500 కోట్ల రూపాయల అదనపు రాబడి ఉంటుందని తెలుస్తోంది. సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యంగా జగన్ పాలన ముందుకు వెళుతోంది. అయితే, ఓవైపు ఆర్థిక అనిశ్చితి , మరోవైపు అప్పుల భారం ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచడానికి వ్యాట్ ని పెంచారు.