Begin typing your search above and press return to search.

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం ఉద్యోగుల‌కు మరో షాక్ ..వీరే ఎక్కువ ట్యాక్స్ కట్టాలంట !

By:  Tupaki Desk   |   29 July 2020 11:30 PM GMT
వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం ఉద్యోగుల‌కు మరో షాక్ ..వీరే ఎక్కువ ట్యాక్స్ కట్టాలంట !
X
కరోనా వైరస్ మహమ్మారి అందరిని అతలాకుతలం చేస్తుంది. ముఖ్యంగా కరోనా వైరస్ ప్రభావం ఉద్యోగులపై చాలా ఉంది. ఈ కరోనా కష్టకాలంలో చాలా మంది తమ ఉద్యోగాలని కోల్పోయారు. మరికొంత మంది వేతనంలో కోతలు ఎదుర్కొంటున్నారు. మరికొందరు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం చేస్తున్నారు. వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం ఇచ్చి , జీతాల్లో కోతలు విధిస్తుండటంతో వారి భాదలు వర్ణనాతీతం. ఈ క్రమంలో గతంలో కంటే ఎక్కువ ట్యాక్స్ క‌ట్టాల్సిన ప‌రిస్థితి రావచ్చు అని కొందరు నిపుణులు హెచ్చరించడంతో వారిలో ఇప్పుడ ఆందోళన పెరిగిపోయింది.

మూమూలుగా ఉద్యోగుల వేతన ప్యాకేజీలో పలు అలవెన్స్‌లు ఉంటాయి. ఫ్యూయెల్ రీయింబర్స్‌ మెంట్, ఎక్స్‌ పెన్సెస్ కన్వె యన్స్ వంటి వాటి పై ఇప్పుడు పన్ను పడబోతోంది. కరోనా కారణంగా దేశంలో చాలా ప్రాంతాల్లో స్థానిక సంస్థలు ట్రావెల్ ‌పై నిషేధం విధించడం ఇందుకు కారణం అని చెప్తున్నారు. అలవెన్స్ ‌లపై పన్ను ప్రయోజనాలు ఖర్చు చేసినప్పుడే వర్తిస్తాయి. లేదంటే అవి పన్ను పరిధిలోకి వస్తాయని ట్యాక్స్ నిపుణులు చెబుతున్నారు.. దీని ప్ర‌భావం.. రూ.5 లక్షలలోపు శాలరీ ప్యాకేజ్ ఉన్న ఉద్యోగులపై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు.

దీనితో, ఇకపై ఇంట్లో నుండి పని చేసేవారు అధిక పన్ను భారం మోయాల్సి రావొచ్చు. అలాగే పన్ను చెల్లింపుదారులకు ఎల్ ‌టీఏ క్లెయిమ్ చేసుకోవడానికి కూడా చాలా తక్కువ కాలం అందుబాటులో ఉంది. పన్ను భారం పెరిగిన కారణంగా ఇంటి వద్ద నుంచే పని చేస్తున్న ఉద్యోగులు ఈ విషయాన్ని దృష్టి లో పెట్టుకోవడం మంచిది . ఇప్పటికే జీతాల్లో కోతలతో అతలాకుతలం అవుతున్న ఉద్యోగులు ఈ ట్యాక్స్ బాదుడు ఏంటి రా బాబు అని తలలు పట్టుకుంటున్నారు.