Begin typing your search above and press return to search.

బీజేపీ కి మరో షాక్..కర్ణాటకలో కూలడం ఖాయమే?

By:  Tupaki Desk   |   30 Nov 2019 12:34 PM GMT
బీజేపీ కి మరో షాక్..కర్ణాటకలో కూలడం ఖాయమే?
X
బీజేపీ ..వరుసగా రెండుసార్లు కేంద్రంలో సంపూర్ణమెజార్టీ తో అధికారాన్ని చేజిక్కించుకోవడం తో తాము పాడిందే పాట..ఆడిందే ఆట అంటూ ముందుకు సాగుతున్నారు. ఈ సమయంలో దేశం మొత్తం బీజేపీ జెండానే ఎగురవేయాలనే లక్ష్యంతో బీజేపీ నేతలు అందివచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. కానీ - మనం ఒకడి కడుపు కొడితే ..మన కడుపుకొట్టే వాడు కూడా ఖచ్చితంగా ఉంటాడు అని అన్నట్టు ..బీజేపీకి ఇప్పుడిప్పుడే అన్ని విషయాలు అర్థం అవుతున్నారు. వ్యూహాలు అమలు చేయడంలో దేశంలో అమిత్ షా తరువాతే ఎవరైనా అని అంటారు .కానీ , అయన వ్యూహానికే ప్రతి వ్యూహం పన్ని ..మహారాష్ట్రలో శివసేన - ఎన్సీపీ - కాంగ్రెస్ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. సరైన బలం లేకుండానే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో అక్కడ మూడు రోజుల ప్రభుత్వంగా బీజేపీ అపకీర్తిని మూటగట్టుకుంది.

ఇక తాజాగా బీజేపీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. అదేమిటి ? ఎందుకు కర్ణాటకలో బీజేపీకి షాక్ తగలబోతోంది ? అనే విషయాలని ఇప్పుడు చూద్దాం..

దేశంలో మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికలు ఎంత అలజడిని సృష్టించాయో..అదే విధంగా కర్ణాటక లో కూడా జరిగిన విషయం తెలిసిందే. కర్ణాటకలో ఎన్నికల ఫలితాల తరువాత బీజేపీ కి సరైన బలం లేకున్నా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ - జేడీఎస్ - కాంగ్రెస్ పెద్దలు - కీలకనేతలు తమ పార్టీ ఎమ్మెల్యే లని కాపాడుకోవడం లో సఫలం కావడంతో .. అక్కడ జేడీఎస్ - కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ , ఆ తరువాత ఏడాదికే బీజేపీ మళ్లీ చక్రం తప్పి ..సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలని తమకి మద్దతుగా మార్చుకొని ..కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలదోసి ... బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీనితో ఆ 17 మంది ఎమ్మెల్యే లపై అనర్హత వేటు వేశారు. దీనితో త్వరలోనే ఆ 17 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఉప ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో రాజకీయం మరింత రంజుగా మారింది.

ప్రస్తుతం బీజేపీకి కర్ణాటకలో 105 మంది ఎమ్మెల్యే లు ఉన్నారు. అలాగే బీజేపీ ప్రభుత్వానికి మరో స్వాతంత్ర్య అభ్యర్థి మద్దతుగా నిలవడంతో ప్రస్తుతం అక్కడ ప్రభుత్వ బలం 105. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 66 - జేడీఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 34 కాగా - బీఎస్పీ పార్టీ నుండి ఒకరు అసెంబ్లీ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇకపోతే .. అనర్హత వేటు పడిన 17 మంది మాజీ ఎమ్మెల్యే లు మళ్లీ బీజేపీ నుండి పోటీ చేస్తున్నారు. దీనితో గతంలో అదే నియోజకవర్గాల నుండి పోటీచేసి ఓడిపోయిన బీజేపీ ఎమ్మెల్యే లు బీజేపీ రెబల్స్ గా మారి పోటీ చేస్తున్నారు. కానీ , ప్రస్తుతం ఆ 17 నియోజకవర్గాలలో బీజేపీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులకి ఆ నియోజకవర్గం వ్యతిరేకంగా ఉన్నట్టు తాజాగా వచ్చిన ఒక సర్వే లో తెలిసింది.

దీనికి ప్రధాన కారణం ..గతంలో ఒక పార్టీ కి ఓటు వేసి గెలిపిస్తే ...ఏడాది కూడా తిరగకముందే ఆ పార్టీని కాదని ..ఇంకో పార్టీలోకి వెళ్లడం ఒక కారణం అయితే , మరో కారణం ఏమిటంటే ..ఈ మధ్య ఆ 17 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల శృంగార వీడియోలు సోషల్ మీడియా ల్లో వైరల్ కావడం. ఉప ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేయబోయేది వీరే అని తెలిసినప్పటి నుండి రోజుకు ఒకరు అన్నట్టు ఒక్కొక్కరి బాగోతాలు బయటపడుతున్నాయి. ఈ వీడియోలు వైరల్ అయిన తరువాత పోటీ చేయబోయే 17 మంది ఎమ్మెల్యేలలో కనీసం ఐదు మంది కూడా గెలిచే అవకాశం లేదు అని తెలుస్తోంది. ఇక కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం నిలవాలి అంటే .. కనీసం అంటే ఏడూ సీట్లు గెలవాల్సి ఉంటుంది. కానీ , కర్ణాటకలో ఉన్న పరిస్థితి చూస్తే ,,బీజేపీ అన్ని సీట్లు సాధించడం దాదాపుగా అసాధ్యం..దీనితో మరోసారి బీజేపీ కర్ణాటకలో గద్దె దిగడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తంగా మరికొన్ని రోజుల్లో బీజేపీ మరో రాష్ట్రంలో అధికారం కోల్పోబోతుంది అని స్పష్టంగా అర్థమౌతుంది.