Begin typing your search above and press return to search.

టీడీపీ కి మరో షాక్ ...ఆ ముగ్గురు కి నోటీసులు ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   27 Nov 2019 6:09 AM GMT
టీడీపీ కి మరో షాక్ ...ఆ ముగ్గురు కి నోటీసులు ఎందుకంటే ?
X
వరుస వలసల తో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. ఎన్నికలలో ఘోరంగా ఓడిపోవడం , పార్టీలో మిగిలిన కీలక నేతలు ఒక్కొకరుగా పార్టీని విడిపోతుండటంతో అధినేత చంద్రబాబు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎదో ఒక విదంగా పార్టీని బలోపేతం చేయాలనీ బాబు చూస్తున్నా కూడా నేతలు పార్టీ ని విడి పోతుండటం తో రోజు రోజు కి పార్టీ పరిస్థితి మరింతగా దిగజారుతోంది. ఇదిలా ఉంటే ..త్వరలోనే ఏపీలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.

వచ్చే నెల 9 నుండి ఈ సమావేశాలు ప్రారంభం కాబోతుండటం తో టీడీపీ , వైసీపీ అసెంబ్లీ లో వ్యవహరించాల్సిన వ్యూహాల పై కసరత్తులు ప్రారంభించాయి. ఈ తరుణంలో టీడీపీ కి స్పీకర్ తమ్మినేని పెద్ద షాక్ ఇచ్చారు. స్పీకర్ తమ్మినేని సీతారాంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను ..టీడీపీ లో కీలక నేతలుగా కొనసాగుతున్న .. ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, కూన రవి కుమార్‌ , చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పై అసెంబ్లీ సెక్రటరీ సభాహక్కుల నోటీసులు పంపారు.

టీడీపీలోని ఈ ముగ్గురు కీలక నేతలు స్పీకర్ గురించి మాట్లాడుతూ .. మీదీ ఒక బతుకేనా...?, శాసనసభలో ఆంబోతు, దున్నపోతులా నిద్రిస్తున్నావ్... వాడు, వీడు అంటూ అసభ్య పదజాలంతో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పై అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ సంచలన వ్యాఖ్యలు చేయగా ..బాబు తనయుడు ఎమ్మెల్సీ నారా లోకేష్ లేఖల రూపంలో స్పీకర్ స్థానాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేసారు. స్పీకర్ గౌరవాన్ని భంగపర్చేలా వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడు, లోకేష్, కూన రవికుమార్‌ కు సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అలాగే దీని పై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.