Begin typing your search above and press return to search.

తాలిబన్లకి మరో షాక్ .. ప్రపంచ బ్యాంకు నిధుల నిలిపివేత

By:  Tupaki Desk   |   25 Aug 2021 11:30 AM GMT
తాలిబన్లకి మరో షాక్ .. ప్రపంచ బ్యాంకు నిధుల నిలిపివేత
X
అఫ్గానిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమించడంతో ఆర్థిక కష్టాలు తీవ్రమయ్యాయి. ఇప్పటికే అఫ్గాన్ రిజర్వులను అమెరికా స్తంభింపజేయగా.. తాజాగా ప్రపంచ బ్యాంకు రంగంలోకి దిగింది. అఫ్గానిస్థాన్ లో చేపట్టిన ప్రాజెక్టులకు నిధుల సరఫరాను నిలిపిచవేసినట్లు ప్రకటించింది. తాలిబన్లు అధికారంలోకి వస్తే అఫ్గాన్ అభివృద్ధి భవిష్యత్ పై , మహిళల హక్కులపై ఆందోళన వ్యక్తం చేసింది. ఐఎంఎఫ్ అఫ్గాన్ కు చెల్లింపులు నిలిపివేసిన కొన్ని రోజుల్లో ప్రపంచ బ్యాంకు నిర్ణయం వెలువడటం గమనార్హం.

ఆ దేశంలోని పరిస్థితిపై ముఖ్యంగా మహిళల హక్కులపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని ఈ బ్యాంకు అధికారి తెలిపారు. ఆఫ్ఘన్ దేశానికి ఇక సాయం చెయ్యబొం..అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం అని ఆయన చెప్పారు. పైగా అంతర్జాతీయ దేశాలతోనూ, భాగస్వాములతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని..ఆఫ్ఘన్ ప్రజలకు తమ మద్దతు ఉంటుందని అన్నారు. ఆఫ్ఘన్ అభివృద్ధికి వరల్డ్ బ్యాంకు రెండు డజన్ల ప్రాజెక్టులను చేపట్టింది. 2002 నుంచి 5.3 బిలియన్ డాలర్లను ఈ దేశ ప్రగతికి వ్యయం చేసింది. ఈ నిధుల్లో చాలావరకు గ్రాంట్ల రూపంలో లభించింది.

గత శుక్రవారం నాటికే కాబూల్ లోని తమ సిబ్బందినంతటినీ వరల్డ్ బ్యాంకు తరలించింది. ఇక అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) కూడా ఆఫ్ఘనిస్తాన్ దేశానికి తన నిధులను ఆపివేసినట్టు ఈ సంస్థ వర్గాలు తెలిపాయి. ఈ సాయంలో 370 మిలియన్ డాలర్ల రుణ కార్యక్రమం కూడా ఉందని, ఇదిగాక.. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ కింద సోమవారానికి మరో 340 మిలియన్ డాలర్ల సాయాన్ని కూడా నిలిపివేశామని పేర్కొన్నాయి.

అమెరికా గతవారమే ఆఫ్ఘన్ సెంట్రల్ బ్యాంకులోని 9.4 బిలియన్ డాలర్ల నిధులను స్తంభింప జేసింది. పేద దేశమైన ఆఫ్ఘానిస్తాన్ గత 20 ఏళ్లుగా నిధులకోసం ఇలా అమెరికా, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వంటి సంస్థలపైనే ఆధారపడుతూ వచ్చింది. కొన్ని సందర్భాల్లో ఇండియా కూడా అక్కడి ప్రాజెక్టులకు సహాయపడింది. భారత ప్రభుత్వం అందజేసిన నిధులతోనే కాబూల్ లో పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. దీన్ని గత ఏడాది ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని ప్రారంభించిన సంగతి తెలిసిందే.