Begin typing your search above and press return to search.

చైనా - పాకిస్థాన్​ కు ఇక చెమటలే..! భారత్​ కు మరో అధునాతన ఆయుధం.

By:  Tupaki Desk   |   21 Dec 2020 2:30 AM GMT
చైనా - పాకిస్థాన్​ కు ఇక చెమటలే..! భారత్​ కు మరో అధునాతన ఆయుధం.
X
మనదేశ సైనికసామర్థ్యం మరింత పెరుగనున్నది. భారత అమ్ములపొదిలోకి మరో అత్యాధునిక ఆయధం రాబోతున్నది. డీఆర్​డీఏ తాజాగా మరో అడ్వాన్స్​డ్​ టౌడ్​ ఆర్టిలెరీ గన్​ సిస్టం ( ఏటీఏజీఎస్​) అనే అత్యాధునిక ఆయుధాన్ని తయారుచేసింది. ఈ ఆయుధాన్ని ఇటీవలే విజయవంతంగా పరీక్షించారు. చైనా , పాకిస్థాన్​ వంటి దేశాలతో తరుచూ సరిహద్దు వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో సైనికసంపత్తిని పెంచుకొనేందుకు భారత కీలక అడుగులు వేస్తున్నది. ఇప్పటికే రాఫెల్​ వంటి అత్యాధునిక ఆయుధాలను మనదేశం దిగుమతి చేసుకున్నది.

ఆత్మనిర్భర్​ భారత్​ భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతోనే అధునాతన ఆయుధాలను తయారుచేస్తున్నారు. శనివారం నిర్వహించిన ఏటీఎజీఎస్​ పరీక్షలు విజయవంతం అయ్యాయి. 48 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాన్ని సైతం ఈ అధునాతన ఆయుధాలు ఛేదించనున్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని తయారుచేసినట్టు ప్రాజెక్టు డైరెక్టర్‌ శైలేంద్ర పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి ఆయుధాలను తయారుచేసే సామర్థ్యం భారత్​కు ఉన్నదని ఆయన చెప్పారు. అయితే ఏటీఏజీఎస్​ ఆయుధాన్ని తాజాగా చైనా సరిహద్దుల్లో విజయవంతంగా పరీక్షించారు.

ఈ ఆయుధాలు సుదూర లక్ష్యాలను కూడా చేరుకోగలవని.. నిమిషానికి ఐదురౌండ్ల కాల్పులు జరపుతాయని చెప్పారు. అయితే కొంతకాలంగా లద్ధాక్ సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది. ఇప్పటికే కొంతమంది సైనికులు కూడా ఇక్కడ అమరులయ్యారు. తాజాగా భారత్​ రఫెల్​ విమానాలను కొనుగోలు చేయడం.. స్వదేశీ పరిజ్ఙానంతో ఆయుధాలు తయారుచేసుకోవడం శుభపరిణామే.