Begin typing your search above and press return to search.
అమ్మ పార్టీలో మరో చీలిక పీలిక!
By: Tupaki Desk | 2 May 2017 5:10 PM GMTఅమ్మ లేని అన్నాడీఎంకే పార్టీలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. అమ్మ మరణించిన నాటి నుంచి చుక్కాని లేని నావలా మారిన పార్టీకి.. అమ్మ విధేయుడు పన్నీరు స్వామి.. అమ్మ నెచ్చెలి శశికళ కాస్త ఆదరవుగా నిలుస్తారని భావించినా.. చిన్నమ్మ తొందరపాటు.. అత్యాశతో పార్టీ రెండు ముక్కలు అయ్యేలా చేశారు.
పన్నీరు.. చిన్నమ్మ వర్గంగా చీలిపోయిన పార్టీలో..అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకెళ్లిన తర్వాత చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో.. చిన్నమ్మ అండ్ కోలను పార్టీ నుంచి గెంటేసే చర్యలకు ఓవైపు పావులు కదుపుతూనే.. మరోవైపు రెండు వర్గాలు విలీనమయ్యేలా పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
అయితే.. రెండు వర్గాల మధ్య విలీన చర్చలు ఒక కొలిక్కి రాకపోవటమే కాదు.. అటు పన్నీరు వర్గం.. ఇటు పళని వర్గం రెండు బిగుసుకుపోయిన నేపథ్యంలో.. విలీన ప్రక్రియ అడుగు ముందుకు పడని పరిస్థితి. దీంతో.. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే.. పళని స్వామితో చర్చల్ని పక్కన పెట్టేసి.. ప్రజల్లోకి వెళ్లటం ద్వారా ఇమేజ్ పెంచుకోవాలని భావిస్తున్నారు పన్నీరు సెల్వం. ఇదిలా ఉంటే.. చిన్నమ్మ వర్గానికి చెందిన పార్టీలో తాజాగా మరో చీలిక పీలికకు రంగం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
మాజీ మంత్రి తోపు వెంకటాచలం సహా అధికార పార్టీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు రహస్య మంతనాలుజరుపుతున్నట్లుగా వచ్చిన సమాచారం సంచలనంగా మారింది. ఈ పరిణామం ఎంత వరకూ వాస్తవ రూపం దాలుస్తుందో ఎవరూ చెప్పలేనప్పటికీ.. ఈ వార్తలు పళని వర్గానికి షాకింగ్ గా మారాయి. ఇదిలా ఉంటే.. రెండువర్గాల మధ్య విలీనానికి సంబందించిన విధివిధానాల్నినిర్ణయించేందుకు ఏర్పాటు చేసిన కమిటీని రద్దు చేయాలని పన్నీరు సెల్వం ఆలోచిస్తున్నట్లుగా చెబుతన్నారు అదే జరిగితే.. అన్నాడీఎంకే పార్టీలో అంతర్గత సంక్షోభం అంతకంతకూ పెరుగుతుందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/