Begin typing your search above and press return to search.

టూరిస్టులకు అదిరిపోయే షాకిచ్చిన గోవా సీఎం .. ఏంటంటే ?

By:  Tupaki Desk   |   28 April 2021 12:30 PM GMT
టూరిస్టులకు అదిరిపోయే షాకిచ్చిన గోవా సీఎం .. ఏంటంటే ?
X
దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండటం తో ఒక్కొక్క రాష్ట్రము కరోనా కట్టడిలో భాగంగా లాక్ డౌన్ ను అమల్లోకి తీసుకువస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను అమల్లోకి తీసుకురాగా .. తాజాగా ఆ జాబితాలో మరో రాష్ట్రం చేరింది. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండడంతో గోవా కూడా లాక్ డౌన్ విధించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ రోజు మధ్యాహ్నం లాక్ డౌన్ పై ప్రకటన చేశారు. గురువారం సాయంత్రం 7 గంటల నుంచి లాక్ డౌన్ అమల్లోకి వస్తుందని, మే 3 వరకు ఐదు రోజులపాటు కొనసాగుతుందని ఆయన ప్రకటించారు.

లాక్ డౌన్ కాలంలో కేవలం అత్యవసర, నిత్యావసర సేవలు, పారిశ్రామిక కార్యకలాపాలు మాత్రమే కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపేస్తున్నట్టు ప్రకటించారు. కాసినోలు, హోటళ్లు, పబ్ లనూ పూర్తిగా మూసేస్తున్నట్టు వెల్లడించారు. నిత్యవసరాల రవాణా కోసం రాష్ట్ర సరిహద్దులను తెరిచే ఉంచుతామని చెప్పారు. ఇక, ఇప్పటికే రాష్ట్రానికి వచ్చి ఉన్న పర్యాటకులు తమ తమ హోటళ్ల రూమ్ ల నుంచి బయటికొచ్చేందుకు అనుమతి లేదని,లాక్ డౌన్ సమయంలో వారందరూ తమ తమ నివాసాల్లోనే ఉండాల్సిందేనని తెలిపారు. రాబోయే నాలుగు రోజులు అత్యంత కీలకమని,ఈ నాలుగు రోజులు ప్రజలెవ్వరూ బయటకి రాకుంటే కోవిడ్ చైన్ ను బ్రేక్ చేయడంతో విజయం సాధిస్తామని సీఎం అన్నారు. ప్రస్తుతం గోవాలో రోజూ 2 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 31 మంది చనిపోగా, 2,110 మంది మహమ్మారి బారిన పడ్డారు. దీంతో మొత్తంగా ఆ రాష్ట్రంలో 81,908 మంది కరోనా బారిన పడగా.. 1,086 మంది చనిపోయారు.