Begin typing your search above and press return to search.
ప్రైవేటీకరణలో మరో ముందడుగు
By: Tupaki Desk | 12 March 2022 4:30 PM GMTమెల్లిగానే అయినా స్థిరంగా వైజాగ్ స్టీల్స్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. తాజాగా ఆస్తి విలువను లెక్కించేందుకు అర్హత కలిగిన మదింపుదారుల నుండి బిడ్లను ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం తరపున స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒకవైపేమో లోకల్ బీజేపీ నేతలు స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగదని పదే పదే చెబుతున్నారు.
అయితే వీళ్ళు చెబుతున్నది ఒకటి జరుగుతున్నది మరొకటి. అందుకనే నేతలు చెబుతున్నదంతా ఉత్త సొల్లు కబుర్లుగా జనాలకు అర్ధమైపోతోంది. ఇప్పటికే ప్రైవేటీకరణ సజావుగా సాగేందుకు వీలుగా న్యాయ సలహాదారుల కోసం, లావాదేవీ సలహాదారుల నియామకానికి నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. ఇపుడు ఈ రెండింటికి అదనంగా అప్రైజర్ నియామకానికి 'రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్'ను ఆహ్వానించింది.
ఆసక్తి ఉన్న వారు ఏప్రిల్ 4వ తేదీలోగా బిడ్లను దాఖలు చేస్తే 5వ తేదీ సాయంత్రం ఓపెన్ చేస్తామని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ తో పాటు దాని అనుబంధ సంస్ధలకు ఉన్న స్థిర, చర ఆస్తులను లెక్కేసి వాటి ప్రస్తుత మార్కెట్ విలువ ఎంతనేది కచ్చితమైన లెక్కలు కట్టాలని నోటిఫికేషన్లో చెప్పింది.
దీనికి ఆధారంగా చుట్టుపక్కల ఆస్తుల క్రియ, విక్రయాలు ఎంతకి జరిగాయనే వివరాలను కూడా తమ టెండర్లలో స్పష్టం చేయాలని చెప్పింది.
అంటే జరుగుతున్నది చూస్తుంటే తొందరలోనే స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరిగిపోవటం ఖాయమని అర్ధమైపోతోంది. కేంద్రం చర్యలను సమర్ధించుకోలేక కమలం పార్టీ నేతలు సొల్లంతా చెబుతున్నారు. ఫ్యాక్టరీని తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా కేంద్రం పట్టించుకోవటం లేదు.
దీంతోనే ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం ఎంత పట్టుదలగా ఉందో అర్ధమైపోతోంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగేట్లు లేదు. మరా అద్భుతం జరుగుతుందా ?